Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli రోహిత్, ద్రావిడ్‌తో కోహ్లీ గొడవ పడ్డాడా?.. అందుకే ఇలా చేస్తున్నాడా?

టీమిండియా వెటరన్ స్టార్ విరాట్ కోహ్లీకి ఏదో అయిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సాధారణంగా మ్యాచ్ ఆడే సమయంలో కోహ్లీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ సమయంలో మాత్రం అలా జరగలేదు. చివరి మూడు రోజుల్లో రోజుకొక పోస్టు షేర్ చేశాడీ స్టార్ బ్యాటర్. దీని వెనుక ఏదో నిగూఢమైన అర్థం ఉందని కొందరు నెటిజన్లు అంటున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. చివరి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. దీంతో 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ నెగ్గింది. ఈ ఓటమితో భారత అభిమానుల ఐసీసీ ట్రోఫీ ఎదురు చూపులు మరింత పెరిగాయి. ఇలాంటి సమయంలో కూడా కోహ్లీ తన ఇన్‌స్టాలో ఒక క్రిప్టిక్ పోస్టు పెట్టాడు.

 Virat Kohli

'సైలెంట్‌గా ఉండటం బలానికి మూలం' అని ఒక పోస్టు పెట్టాడు. ఇంతకుముందు కూడా కోహ్లీ ఇలాంటిదే ఒక పోస్టు పెట్టాడు. 'మనకు బాధలు, భయాలు, అనుమానాలు ఎక్కువైతే ప్రేమించడానికి సమయం ఉండదు. కాబట్టి ఒక్కోసారి అన్నీ వదిలేయడాన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి' అని పోస్టు పెట్టాడు. ఇదంతా చూసిన కొందరు ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో కోహ్లీకి విభేదాలు వచ్చాయని, అందుకే కోహ్లీ ఇలాంటి పోస్టులు పెడుతున్నాడని అంటున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడే జట్టు ఎంపికలో కోహ్లీ అభిప్రాయాలను రోహిత్, ద్రావిడ్ పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కోహ్లీ చాలా హర్ట్ అయినట్లు తెలుస్తోంది.

ఇలా తన సూచనలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కోహ్లీకి కోపం వచ్చిందని, టీం మేనేజ్‌మెంట్‌పై కోపంగా ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటుతో కూడా రాణించని సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులకే అవుటైన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్‌స్టంప్ ఆవల పడిన బంతిని ఆడబోయి అవుటయ్యాడు.

ఇలా వికెట్ పారేసుకున్నందుకు కోహ్లీపై చాలా మంది మండిపడ్డారు. పరిస్థితికి తగ్గట్లు ఆడాల్సిన సీనియర్ ప్లేయర్ ఇలా వికెట్ పారేసుకోవడం ఏంటని కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రోహిత్, కోహ్లీ మధ్య మళ్లీ విభేదాలు వస్తే మాత్రం అది భారత క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదు. అసలే వరల్డ్ కప్ ఉన్న ఏడాదిలో ఇలాంటి వార్తలు రావడం ఆందోళనకరం.

Story first published: Monday, June 12, 2023, 12:27 [IST]
Other articles published on Jun 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+