Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS: నాలుగో టీ20పై వరుణుడి కన్ను.. వరుసగా ఇక్కడ వర్షాలే!

ఆస్ట్రేలియాతో మూడో టీ20లో చివరి బంతికి ఓటమిపాలైన భారత జట్టు.. నాలుగో టీ20కి రెడీ అవుతోంది. రాయ్‌పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్ తమ ఖాతాలో వేసుకోవాలని భారత్ భావిస్తోంది. అదే సమయంలో వరుసగా చివరి మూడు మ్యాచులు నెగ్గి సిరీస్ గెలవాలని ఆస్ట్రేలియా అనుకుంటోంది.

ఇక్కడి షహీద వీర్ నారాయణ సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మూడో టీ20లో మ్యాక్స్‌వెల్ చెలరేగడంతో గెలిచిన ఆసీస్.. ఇక్కడ కూడా సత్తా చాటాలని అనుకుంటోంది. ఇక్కడ వాతావరణం విషయానికొస్తే.. ఆటగాళ్లను వాతావరణం అంతగా ఇబ్బంది పెట్టే అవకాశాలు లేవని తెలుస్తోంది.

 INDvsAUS Will rain spoil the fourth T20I at Raipur

రాయ్‌పూర్‌లో మ్యాచ్ జరిగే సాయంత్రం 7 గంటల నుంచి 10.30 వరకు అత్యధికంగా కేవలం 19 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. కానీ ఆకాశం మేఘావృతమై ఉంటుందని సమాచారం. అలాంటప్పుడు, ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

అయితే ఇక్కడ తేమ స్థాయి మాత్రం ఏకంగా 83 శాతం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ ముందు రోజుల్లో ఇక్కడ జల్లులు పడినట్లు తెలుస్తోంది. అయితే మ్యాచ్ రోజు మాత్రం ఏమాత్రం వర్షం పడదని, మ్యాచ్‌కు వర్షం వల్ల ఎలాంటి అంతరాయం జరగదని అధికారులు చెప్తున్నారు.

భారత జట్టు అంచనా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్

Story first published: Friday, December 1, 2023, 8:26 [IST]
Other articles published on Dec 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+