వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి ఇంకా భారత అభిమానుల గుండెల్లో పచ్చిగానే ఉంది. అప్పుడే ఆసీస్‌తో టీ20 సిరీస్ వచ్చేసింది. విశాఖపట్టణం వేదికగా తొలి మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. గురువారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఇక్కడి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ మైదానం వేదికగా మ్యాచ్ జరుగుతుంది.
ఇక్కడి పిచ్ చాలా బ్యాలెన్స్‌గా ఉంటుందని పేరు. అటు బౌలర్లకు, ఇటు బ్యాటర్లకు పిచ్ నుంచి ఎంతో కొంత సహకారం లభిస్తూనే ఉంటుంది. రోహిత్, పాండ్యా ఇద్దరూ లేకపోవడంతో ఈ సిరీసులో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఆడుతున్నాడు. అటు స్పిన్నర్‌గా, ఇటు బ్యాటర్‌గా రెండు రకాలుగానూ అతను రాణిస్తాడు. అందుకే వాషింగ్టన్‌ను టీమిండియాకు భవిష్యత్తులో చాలా అవసరమని ఫ్యాన్స్ అంటుంటారు. అయితే ఈ స్టార్ ప్లేయర్ ఎక్కువగా గాయాలపాలు అవుతుంటాడు.
ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా గుర్తుచేశాడు. ఈ సిరీస్‌కు వచ్చే సమయంలో కూడా సుందర్ 'హ్యాండిల్ విత్ కేర్' స్టిక్కర్ వేసుకొని వస్తాడంటూ జోకులు వేశాడు. జట్టుకు చాలా అవసరమైన ఆటగాళ్లలో సుందర్ ఒకడని చోప్రా అన్నాడు. కానీ అతని ఫిట్‌నెస్ పెద్ద సమస్య అని చెప్పాడు.
'వాషింగ్టన్ సుందర్ మంచి ఆల్‌రౌండర్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ హ్యాండ్ బౌలర్. పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేయగల సమర్ధుడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా చక్కగా రాణించాడు. కానీ అతని ఫిట్‌నెస్ చాలా పెద్ద సమస్యగా మారింది. తను ఎంత వీక్ అంటే.. ఏం చేస్తున్నా తను గాయపడొచ్చు. ఇదే పెద్ద సమస్యగా మారుతుంది' అని చెప్పుకొచాడు.