Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS: ఆసీస్‌కు అదిరే ఆరంభం ఇచ్చిన హెడ్..!

Travis Head: భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆసీస్ జట్టుకు అదిరే ఆరంభం లభించింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు చేసింది. జైస్వాల్ (6), ఇషాన్ కిషన్ (0) ఇద్దరూ ఫెయిలయ్యారు.

అయితే రుతురాజ్ గైక్వాడ్ (123 నాటౌట్) అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి సూర్యకుమార్ యాదవ్ (39), తిలక్ వర్మ (31 నాటౌట్) ఇద్దరూ మంచి సహకారం అందించారు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

INDvsAUS Travis HeadINDvsAUS Travis Head gave a thunderous opening to Australia gave a thunderous opening to Australia

ఈ భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు అదిరే ఆరంభం దక్కింది. ఈ సిరీసులో తొలి మ్యాచ్ ఆడుతున్న ట్రావిస్ హెడ్ (35) ధనాధన్ షాట్లతో భారత బౌలర్లపై ఎదురు దాడి చేశాడు. అతనికి ఆరోన్ హార్డీ (16) మంచి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ కలిసి 4 ఓవర్లలోనే 47 పరుగులతో ఆసీస్‌కు అదిరే ఆరంభం అందించారు.

వీళ్లిద్దరూ చెలరేగడంతో ఆసీస్ ఈ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించేలా కనిపించింది. అయితే అర్షదీప్ సింగ్.. భారత జట్టుకు తొలి బ్రేక్ ఇచ్చాడు. అతని బౌలింగ్‌లో హార్డీని పెవిలియన్ చేర్చాడు. అర్షదీప్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన హార్డీ అవుటయ్యాడు.

ఆ తర్వాత కాసేపటికే ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ కూడా అవుటయ్యాడు. దీంతో ఆసీస్ జోరుకు కళ్లెం వేసినట్లయింది. తొలి టీ20లో సెంచరీతో చెలరేగిన జోష్ ఇంగ్లిస్‌ను రవి బిష్ణోయి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంగ్లిస్ 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ జట్టు 6.2 ఓవర్లలో 68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. బౌలింగ్‌లో ఇదే ఒత్తిడిని కొనసాగిస్తే ఈ మ్యాచులోనే భారత జట్టు సిరీసును తన ఖాతాలో వేసుకోగలుగుతుంది.

Story first published: Tuesday, November 28, 2023, 22:29 [IST]
Other articles published on Nov 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+