For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS: ఆ ముగ్గురికీ ఇది చావో రేవో.. ఆడకపోతే వరల్డ్ కప్‌లో కూడా నో ఛాన్స్!

వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి ఇంకా భారత అభిమానుల గుండెల్లో పచ్చిగానే ఉంది. అప్పుడే ఆసీస్‌తో టీ20 సిరీస్ వచ్చేసింది. విశాఖపట్టణం వేదికగా తొలి మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. గురువారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఇక్కడి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ మైదానం వేదికగా మ్యాచ్ జరుగుతుంది.

ఇక్కడి పిచ్ చాలా బ్యాలెన్స్‌గా ఉంటుందని పేరు. అటు బౌలర్లకు, ఇటు బ్యాటర్లకు పిచ్ నుంచి ఎంతో కొంత సహకారం లభిస్తూనే ఉంటుంది. రోహిత్, పాండ్యా ఇద్దరూ లేకపోవడంతో ఈ సిరీసులో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

INDvsAUS This is a make or break series for these three youngsters

అయితే వరల్డ్ కప్ ఓటమి బాధలో ఉన్న చాలా మంది ఫ్యాన్స్.. ఈ సిరీస్‌పై ఇంట్రస్ట్ చూపించడం లేదు. అసలు ఇది అవసరమా? అని కూడా కొందరు ప్రశ్నించారు. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సమాధానం ఇచ్చాడు. ఈ సిరీస్ చూసేవాళ్లకు పెద్దగా ప్రాధాన్యం ఉన్నట్లు అనిపించకపోవచ్చని, కానీ కొందరు ప్లేయర్లకు ఇది చాలా కీలకమని చెప్పాడు.

ఇకపై అంతర్జాతీయ టీ20లు ఆడకూడదని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ సీరిసులో కూడా రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ పోటీలో ఉన్నారు. గిల్ కూడా ఓపెనింగ్ స్థానం కోసమే పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సిరీసులో గిల్ ఆడటం లేదు. కాబట్టి గైక్వాడ్, జైస్వాల్, కిషన్.. వీళ్లు ముగ్గురికీ తమ సత్తా నిరూపించుకునే ఛాన్స్ ఇదేనని, వచ్చే టీ20 వరల్డ్ కప్ ముందు పెద్దగా టీ20లు లేని నేపథ్యంలో ఇది చాలా ముఖ్యమని చోప్రా చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ టీంను సెలెక్ట్ చేసే పని ఇప్పటి నుంచే మొదలవుతుందన్నాడు.

'టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికవ్వాలంటే ఈ సిరీస్ ఒక అవకాశం. ఎందుకంటే తర్వాతి వరల్డ్ కప్ నాటికి కనీసం 25 టీ20లు కూడా లేవు. కాబట్టి ఈ అవకాశాలను చాలా బాగా ఉపయోగించుకోవాలి. అలా చూస్తే కిషన్, గైక్వాడ్, జైస్వాల్ ముగ్గురికీ ఈ సిరీస్ చాలా కీలకం. దీనిలో ఆడకపోతే వరల్డ్ కప్‌కు ఎంపికవడం కష్టమనే చెప్పాలి' అని పేర్కొన్నాడు.

Story first published: Thursday, November 23, 2023, 11:02 [IST]
Other articles published on Nov 23, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+