For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS: బౌలర్లకు హెచ్చరిక.. ఈ ముగ్గురు స్టార్ బ్యాటర్లతో డేంజర్!

వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేల సిరీసుకు అంతా రెడీ అయింది. మొహాలీ వేదికగా జరిగే తొలి వన్డేలో రెండు జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ మూడు వన్డేల సిరీసులో అత్యధిక పరుగులు చేసే అవకాశం ఉన్న బ్యాటర్లు ఎవరనే చర్చ ఫ్యాన్స్ మధ్య జరుగుతోంది.

శుభ్‌మన్ గిల్:ఆసియా కప్ మొదలవడానికి ముందు గిల్ ఫామ్‌పై చాలా సందేహాలు తలెత్తాయి. విండీస్‌పై కూడా అతను పెద్దగా రాణించకపోవడంతో ఈ అనుమానాలు మరింత పెద్దవయ్యాయి. అయితే ఆసియా కప్‌లో వీటన్నింటినీ గిల్ (Shubman Gill) పటాపంచలు చేశాడు. అద్భుతమైన ఆటతీరుతో రోహిత్‌తో కలిసి టీమిండియాకు మంచి ఆరంభాలు అందించాడు.

INDvsAUS These three batters will score more runs in the ODI series

ఈ టోర్నీలో ఏకంగా 75.5 సగటుతో 302 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో వరల్డ్ కప్ ముందు జరిగే ఆసీస్ సిరీసులో కూడా అత్యధిక పరుగులు చేసే బ్యాటర్ల జాబితాలో గిల్ ముందు వరుసలో ఉన్నాడు.

స్టీవ్ స్మిత్:గాయం వల్ల సౌతాఫ్రికా సిరీసుకు దూరమైన స్టీవ్ స్మిత్.. రీఎంట్రీలో తను టీంకు ఎంత ముఖ్యమో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన యాషెస్ టెస్టులో అతని ఎడమ మణికట్టుకు గాయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆటకు దూరమైన అతను.. వరల్డ్ కప్ ముందు ఫామ్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలోనే కమిన్స్, స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌లను నెట్స్‌లో రెండు గంటలపాటు ఎదుర్కొన్న స్మిత్ (Steve Smith).. చాలా మంచి మూడ్‌లో ఉన్నట్లు చెప్పాడు. భారత్‌లో మంచి రికార్డు ఉన్న స్మిత్.. ఈ మూడు వన్డేల్లో కూడా అదరగొట్టాలని ఆసీస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

INDvsAUS These three batters will score more runs in the ODI series

కేఎల్ రాహుల్:గాయం నుంచి కోలుకున్న తర్వాత పాక్‌పై అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చిన ప్లేయర్ కేఎల్ రాహుల్. ఆసియా కప్‌లో చక్కగా రాణించిన అతను.. ఆసీస్‌తో సిరీసులో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఎంతో కీలకమైన రాహుల్ (KL Rahul).. ఆసియా కప్ ఫామ్‌ను ఆస్ట్రేలియాపై కొనసాగించేందుకు రెడీ అవుతున్నాడు.

కెప్టెన్‌గా కూడా బాధ్యతలు చేపట్టిన అతను.. మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకోవాల్సి ఉంది. అదే జరిగితే అతను భారీ ఇన్నింగ్సులు ఆడటం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Story first published: Friday, September 22, 2023, 8:42 [IST]
Other articles published on Sep 22, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+