Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS: తొలి టీ20లో వీళ్లిద్దరూ అట్టర్ ఫ్లాప్.. అందుకే ఆసీస్ భారీ స్కోరు!

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచులో బ్యాటుతో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ చెలరేగారు. దీంతో 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా భారత జట్టు ఈజీగా ఛేదించేలా కనిపించింది. అయితే చివరి ఓవర్లో రెండు వరుస రనౌట్లు మ్యాచ్‌ను థ్రిల్లింగ్‌గా మార్చేశాయి. ఈ క్రమంలో ఈ మ్యాచులో ఫ్లాప్ అయిన ప్లేయర్లు ఎవరని ఒకసారి పరిశీలిస్తే..

రవి బిష్ణోయి:టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయి ఈ మ్యాచులో పెద్దగా ఆకట్టుకోలేదు. సెంచరీతో చెలరేగిన ఆసీస్ యువ ప్లేయర్ జోష్ ఇంగ్లిస్‌ను రెండుసార్లు అవుట్ చేసే అవకాశం బిష్ణోయికి దక్కింది. అయితే ఈ రెండు సార్లూ దాన్ని అతను నేలపాలు చేశాడు. జోష్ ఇంగ్లిస్ తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఒక క్యాచ్ ఇచ్చాడు. దాన్ని అందుకోవడంలో బిష్ణోయి విఫలమయ్యాడు.

INDvsAUS Team India won but these players failed miserably

ఆ తర్వాత కాసేపటికే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఇంగ్లిస్‌ను రనౌట్ చేసే అవకాశం దక్కింది. అప్పుడు బౌలింగ్ చేస్తున్న బిష్ణోయి.. ఆ రనౌట్‌ను కూడా చెడగొట్టేశాడు. ఈ తప్పులకు ఇంగ్లిస్ చేతిలో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. బిష్ణోయి బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఈ స్పిన్నర్ కేవలం 4 ఓవర్లలోనే 54 పరుగులు సమర్పించుకున్నాడు.

ప్రసిద్ధ్ కృష్ణ:విశాఖపట్టణం పిచ్ నుంచి ప్రసిద్ధ్ కృష్ణకు అంత సహకారం లభించని మాట వాస్తవమే. అలాంటి సమయంలోనే ఆటగాడి తెంపరితనానికి పెద్ద పరీక్ష ఎదురవుతుంది. దీన్ని ఎదుర్కోవడంలోనే అతని నాణ్యత కూడా బయటపడుతుంది. కానీ ఈ విషయంలో కృష్ణ దారుణంగా విపలమయ్యాడు. నాలుగు ఓవర్లలో ప్రసిద్ధ్ కూడా బిష్ణోయిలాగే 54 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీసుకున్నాడు.

తను వేసిన తొలి మూడు బంతులను షార్ట్ పిచ్‌ డెలివరీలు వేశాడు కృష్ణ. వీటికి షార్ట్, స్మిత్ ఇద్దరూ భారీ షాట్లు ఆడారు. ఇక ఆ తర్వాత ఇంగ్లిస్ అయితే ప్రసిద్ధ్‌కు చుక్కలు చూపించాడు. రెగ్యులర్ పేసర్ల గైర్హాజరీలో బౌలింగ్ బృందానికి నాయకత్వం వహిస్తాడని అనుకున్న ప్రసిద్ధ్ ఇంత దారుణంగా ఆడటం వల్లనే ఆసీస్ అంత భారీ స్కోరు చేసిందని చెప్పాలి.

Story first published: Friday, November 24, 2023, 14:14 [IST]
Other articles published on Nov 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+