ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు టాస్ ఓడింది. ఇండోర్‌లోని హోల్కార్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో భారత జట్టు కీలక మార్పు చేసింది. వ్యక్తిగత కారణాలతో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ ఆడటం లేదని బీసీసీఐ తెలిపింది. మళ్లీ మూడో మ్యాచ్ సమయానికి బుమ్రా తిరిగి జట్టుతో కలుస్తాడని తెలుస్తోంది.
ఈ క్రమంలో బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ ఆడుతున్నట్లు కేఎల్ రాహుల్ వెల్లడించాడు. అలాగే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పిచ్ బాగుందని బ్యాటర్లు రాణించి భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఉందని రాహుల్ అన్నాడు. ఇక ఆస్ట్రేలియా టీంలో రెండు కీలక మార్పులు జరిగినట్లు కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు.

ఈ మ్యాచులో ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ ఓపెనర్ మిచెల్ మార్ష్ ఇద్దరూ ఆడటం లేదు. దీంతో జట్టు సారధ్య బాధ్యతలను స్టీవ్ స్మిత్‌కు అప్పగించడం జరిగింది. అలాగే కొంత కాలంగా గాయంతో జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఈ మ్యాచులో రీఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే కొత్త కుర్రాడు స్పెన్సర్ జాన్సన్ అరంగేట్రం చేస్తున్నట్లు స్మిత్ వెల్లడించాడు.
భారత జట్టు: శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ
ఆస్ట్రేలియా టీం: డేవిడ్ వార్నర్, మాట్ షార్ట్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేర్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, షాన్ ఆబాట్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్