ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు మరోసారి భారీ మార్పులతో బరిలో దిగింది. చాలా మంది కుర్రాళ్లకు విశ్రాంతి ఇచ్చిన టీమిండియా.. విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా ఎంచుకోవడం గమనార్హం. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరో ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటర్లకు పిచ్ సహకరిస్తుందని తెలియడంతోనే కమిన్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
బ్యాటింగ్‌కు స్వర్గధామంగా పిలిచే రాజ్‌కోట్‌లో సగటు ఇన్నింగ్స్ స్కోరు 316 పరుగులు. కాబట్టి బౌలర్లు ఈ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. పిచ్ చాలా బాగుందని, తమకు గేమ్ టైం దొరకడం సంతోషమని టాస్ సమయంలో కమిన్స్ చెప్పాడు. తమ టీంలో ఐదు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. రెండో వన్డే ఆడని మిచెల్ మార్ష్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మ్యాక్స్‌వెల్ జట్టులోకి తిరిగొచ్చారు.

అదే సమయంలో షాన్ ఆబాట్, మాట్ షార్ట్, జోష్ ఇంగ్లిస్, జాన్సన్, ఆడం జంపా ఆడటం లేదు. ఇక్కడి వాతావరణ చక్కగా ఉందని, మొహాలీ అంత ఎండగా ఏం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ప్లేయర్లకు బ్రేక్ ఇవ్వడం మానసికంగా చాలా ముఖ్యమని చెప్పాడు. జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన రోహిత్.. జట్టులో చాలా మార్పులు చేశామని వెల్లడించాడు.
తనతోపాటు విరాట్ కోహ్లీ, కుల్దీప్ అందరూ తిరిగొచ్చేశారని చెప్పాడు. అలాగే కొందరు ప్లేయర్లు ఆడటం లేదన్నాడు. అశ్విన్ కూడా ఆడటం లేదని, అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆడుతున్నాడని చెప్పాడు. మిడిలార్డర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా అనారోగ్యంతో మ్యాచ్ ఆడటం లేదని రోహిత్ తెలిపాడు. ఈ క్రమంలో స్థానిక ప్లేయర్లు కొందరు వాటర్, డ్రింక్స్ సమయంలో టీంకు సహకరిస్తారని బీసీసీఐ తెలపింది.
ఆస్ట్రేలియా టీం: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీన్ సంఘా, జోష్ హాజిల్‌వుడ్
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ