ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడేందుకు భారత జట్టు రెడీ అవుతోంది. ఈ సిరీసులో టీమిండియా ప్రధాన లక్ష్యం వరల్డ్ కప్ జట్టును ఫైనలైజ్ చేయడమే అని తెలిసిందే. వన్డేల్లో ఏమాత్రం రాణించని సూర్యకుమార్ యాదవ్‌కు ద్రావిడ్ బాగా మద్దతిస్తున్నాడు. అయితే వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం రావాలంటే మాత్రం సూర్య తన సత్తా నిరూపించుకోక తప్పదు.
ఆసీస్‌పై తొలి వన్డేలో తన అసాధారణ షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడిన అతను హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆసియా కప్‌లో బంగ్లాపై స్పిన్నర్లను ఎదుర్కోవడానికి కేవలం స్వీప్ షాట్‌ను నమ్ముకున్న సూర్య.. ఆసీస్‌పై అసలు ఈ షాటే ఆడలేదు. తను ఎదుర్కొన్న బంతులను స్ట్రైట్ డ్రైవ్ చేయడానికే ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను ఇచ్చిన కష్టమైన రిటర్న్ క్యాచ్‌ను స్టొయినిస్ వదిలేశాడు.

దీంతో సూర్య బతికిపోయాడు. ఇలా కేవలం స్ట్రెయిట్ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన సూర్యను చాలా మంది మెచ్చుకున్నారు. స్వీప్ షాట్ ఆడకుండా తనను తాను నిగ్రహించుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. అయితే ఇలా కేవలం స్ట్రెయిట్ షాట్లనే నమ్ముకోవడం కూడా అంత గొప్ప నిర్ణయం కాదని మరికొందరు అంటున్నారు. జట్టులో చోటు కావాలంటే సూర్య తన సత్తా నిరూపించుకోవాలని సూచిస్తున్నారు.
అయితే స్వీప్ షాట్ లేదంటే స్ట్రెయిట్ డ్రైవ్ ఇలా ఏదో ఒక షాట్‌ను నమ్ముకోవడం ప్రొఫెషనల్ క్రికెటర్‌కు సమంజసం కాదనేది వారి వాదన. కానీ ఇంతకుముందు ఆసీస్‌పై వరుసగా మూడు గోల్డెన్ డక్‌లు నమోదు చేసిన సూర్య.. ఈసారి తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం అయితే మెచ్చుకోదగిన విషయమే అని ఫ్యాన్స్ అంటున్నారు.
అయితే అతన్ని రెండు సార్లు డకౌట్ చేసిన మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్ ఆడలేదనే విషయం గుర్తుంచుకోవాలి. స్టార్క్ వంటి ప్రమాదకర బౌలర్‌ను ఎదుర్కొనేటప్పుడు ఇలా ఒక్క షాట్‌నే నమ్ముకుంటే సూర్య రాణించడం కష్టమే.