ఆస్ట్రేలియా, భారత్ జట్లు మూడు వన్డేల సిరీస్ కోసం రెడీ అయ్యాయి. దీంతో తమ వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌కు ఫినిషింగ్ టచ్‌లు ఇవ్వాలని రెండు జట్లు అనుకుంటున్నాయి. అదే సమయంలో కొందరు ప్లేయర్లకు ఈ సిరీస్ మరికొంత స్పెషల్‌గా మారనుంది. వారిలో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ ఒకడు.
లార్డ్స వేదికగా జరిగిన యాషెస్ టెస్టులో స్మిత్ మణికట్టుకు గాయమైంది. ఈ గాయం వల్ల అతను సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీసుకు దూరమయ్యాడు. మళ్లీ వరల్డ్ కప్ ముందు జట్టుతో చేరాడు. ఈ క్రమంలో అతనికి భారత్‌తో జరుగుతున్న సిరీసు చాలా కీలకంగా మారింది. భారత్‌లో మంచి రికార్డు ఉన్న అతను ఫామ్ అందుకుంటే.. వరల్డ్ కప్‌లో కూడా ఆసీస్ బలం రెట్టింపు అవుతుంది.

అంతేకాదు ఇప్పటి వరకు వన్డే కెరీర్‌లో స్మిత్ ఓవరాల్‌గా 4939 పరుగులు చేశాడు. అతను కనుక మరో 61 పరుగులు చేస్తే వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడీ ఆసీస్ స్టార్. తను ఈ ఫీట్‌ను మొహాలీ వేదికగా జరిగే మొదటి వన్డేలోనే అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక ఈ సిరీస్ చాలా ముఖ్యమైన మరో ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. ఈ ఏడాది మార్చిలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీసు జరిగింది. దానిలో వరుసగా మూడు మ్యాచుల్లో సూర్య తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. ఇలా మూడు గోల్డెన్ డక్‌లు నమోదు చేసి చెత్త రికార్డు తన పేరిట రాసుకున్నాడు.
అప్పటికి, ఇప్పటికి తన ఆటలో మార్పు వచ్చిందని, వన్డేల్లో రాణించడానికి ప్రయత్నిస్తున్నాడని సూర్యపై ద్రావిడ్ సహా అందరూ నమ్మకం ఉంచుతున్నారు. కానీ అతను కనుక ఈ ఆసీస్ సిరీసులో రాణించకపోతే వరల్డ్ కప్‌లో కూడా జట్టుకు సూర్య బలహీనతగానే మారతాడని చెప్పొచ్చు.
మరి సూర్య ఆ మూడు గోల్డెన్ డక్‌ల పీడకలను మర్చిపోయి, వన్డేల్లో తన ఆట మెరుగైందని నిరూపించుకుంటాడా? అనేది ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తున్న ప్రశ్న. సూర్యను వరల్డ్ కప్ టీంలో నుంచి తీసేయడం జరగదని ద్రావిడ్ నమ్మకంగా చెప్పాడు. కానీ రాణించకపోతే టీంలో సూర్య ఉంది లాభం ఏంటనేది ప్రశ్న. వీటికి సూర్య తన బ్యాటుతో సమాధానం చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.