ఆస్ట్రేలియాతో మూడో టీ20కి భారత జట్టు రెడీ అయింది. గువాహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఆసీస్ జట్టు టాస్ గెలిచింది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచులు గెలిచిన భారత జట్టు.. ఈ ఐదు టీ20ల సిరీసులో 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ భారత్ వశం అవుతుంది.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. 'ఆ తర్వాత మంచు ఎక్కువగా పడుతుందని అనుకోవడం లేదు. అందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాం. మేం కొన్ని విషయాల్లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. మంచు కురిసిన తర్వాత ఈ పిచ్‌పై ఎలాంటి టార్గెట్ అయినా ఛేజ్ చేయగలమనే నమ్మకం మాకు ఉంది' అని వేడ్ చెప్పాడు.

అలాగే తమ జట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. బెహ్రెండాఫ్, ట్రావిస్ హెడ్, కేన్ రిచర్డ్‌సన్ ఆడుతున్నారని చెప్పాడు. మాథ్యూ షార్ట్, షాన్ ఆబాట్, ఆడమ్ జంపాను పక్కన పెట్టామని తెలిపాడు. ఇక తాము ముందుగా బ్యాటింగ్ చేయడానికి సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.
'మన ప్రాసెస్‌పై నమ్మకం ఉంచాలని కుర్రాళ్లకు చెప్పా. ఇప్పటి వరకు ఏం చేస్తూ వచ్చామో అదే చేస్తే చాలని వివరించా. మా జట్టులో ఒకే మార్పు చేశాం. ముఖేష్ కుమార్ స్థానంలో ఆవేష్ ఖాన్‌ను తీసుకున్నాం. ముఖేష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. అందుకే అతను ఆడటం లేదు' అని సూర్య తెలిపాడు.
టీమిండియా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేష్ ఖాన్
ఆస్ట్రేలియా టీం: ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), కేన్ రిచర్డ్‌సన్, నాథన్ ఎల్లీస్, జేసన్ బెహ్రెండాఫ్, తన్వీర్ సంఘా