For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shubman Gill: అప్పుడు నా వయసు పదేళ్లు.. అప్పటి నుంచి ఇదే కల: శుభ్‌మన్ గిల్

వరల్డ్ కప్ దగ్గర పడటంతో అందరూ కూడా టీమిండియా మళ్లీ ట్రోఫీ నెగ్గాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో మెగా టోర్నీలో టీమిండియాకు మంచి ఆరంభాలు అందించాల్సిన శుభ్‌మన్ గిల్ తనకు వరల్డ్ కప్ నెగ్గాలనే కోరిక ఎప్పటి నుంచి ఉందో చెప్పాడు. ధోనీ సారధ్యంలో 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే.

అది చూసినప్పటి నుంచి తనకు కూడా జీవితంలో ఒక్కసారైనా వరల్డ్ కప్ ఎత్తాలని ఆశ కలిగిందని గిల్ చెప్పుకొచ్చాడు. ధోనీ సేన ఈ వరల్డ్ కప్ గెలిచినప్పుడు గిల్‌ వయసు 12 సంవత్సరాలు. కపిల్ దేవ్ సారధ్యంలో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత్ మళ్లీ వరల్డ్ కప్ గెలవలేకపోయింది. అయితే 28 ఏళ్ల తర్వాత ధోనీ కెప్టెన్సీలో విశ్వవిజేతగా నిలిచింది.

Shubman Gill

దీని గురించి తాజాగా మాట్లాడిన గిల్.. ఆ విజయం చూసినప్పుడు తనకు కలిగిన అనుభూతిని వివరించాడు. '2011లో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచినప్పుడు నేను 10-12 ఏళ్ల పిల్లాడిని. ఆ విజయం నాకు గొప్ప అనుభూతిని కలిగించింది. అప్పుడే అనుకున్నా.. నేను కూడా జీవితంలో ఒక్కసారైనా వరల్డ్ కప్ ట్రోఫీని గాల్లోకి ఎత్తాలని' అని గుర్తుచేసుకున్నాడు.

'వరల్డ్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం అనేది ప్రతి పిల్లాడికీ ఉండే కలే. నేను కూడా ఎదిగేటప్పుడు అదే కల కన్నా' అని చెప్పాడు. ప్రస్తుతం టీమిండియాలో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లలో గిల్ ఒకడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో కూడా గిల్ చెలరేగాడు. ఈ టోర్నీలో 302 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

తను ఎప్పుడూ మెరుగవడానికే ప్రయత్నిస్తానని, జట్టు కోసం ఏదైనా చేయాలని అనుకుంటానని గిల్ చెప్పాడు. 'నా వరకు ఈ ప్రయాణం చందమామ కథకు ఏమాత్రం తక్కువ కాదు. మనం మెరుగ్గా ఆడేకొద్దీ మనపై మన ఎక్స్‌పెక్టేషన్లు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ టోర్నమెంట్‌లో ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా సరే నా బెస్ట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటా' అని పేర్కొన్నాడు.

Story first published: Thursday, September 21, 2023, 23:03 [IST]
Other articles published on Sep 21, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+