Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shubman Gill: బాబర్ టాప్ ర్యాంకుకు ఎసరు.. నెంబర్ వన్ ర్యాంకును టార్గెట్ చేసిన గిల్!

టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది భారత్ తరఫున అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా గిల్ నిలిచాడు. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై అతను చేసిన సెంచరీ ఈ ఏడాది అతనికి ఆరో శతకం. ఆసియా కప్‌లో అదరగొట్టిన గిల్ ఈ టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఈ టోర్నీలో 75.50 సగటుతో 302 పరుగులు చేసిన గిల్.. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో కెరీర్ అత్యుత్తమంగా రెండో ర్యాంకు చేరుకున్నాడు. భారత జట్టు ఆసియా కప్ నెగ్గడంలో ఇలా గిల్ (Shubman Gill) నిలకడగా రాణించడం కూడా ఒక కారణమే అని చెప్పాలి. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఉన్న సంగతి తెలిసిందే.

Shubman Gill:

బాబర్ (Babar Azam) 857 రేటింగ్ పాయింట్లతో వన్డేల్లో టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం గిల్ వద్ద 814 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అయితే వరల్డ్ కప్‌నకు ముందు ఆస్ట్రేలియాతో భారత జట్టు మూడు వన్డేలు ఆడుతుంది. కానీ పాకిస్తాన్‌ ఎలాంటి సిరీస్ ఆడటం లేదు. దీంతో బాబర్‌ను పక్కకు నెట్టి వన్డే బ్యాటర్లలో అగ్రస్థానం సాధించే ఛాన్స్ గిల్‌కు వచ్చింది.

ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల్లో గిల్ తన సత్తా మేరకు రాణించి కనీసం 200 పరుగులు చేయాల్సి ఉంటుంది. అప్పుడు బాబర్‌ను వెనక్కు నెట్టి వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ స్పాట్ అందుకుంటాడీ పంజాబ్ కుర్రాడు (Shubman Gill). శుక్రవారం నాడు భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే జరుగుతుంది. ఈ సిరీసులో తొలి రెండు వన్డేలకు సీనియర్లు దూరమయ్యారు.

రోహిత్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా తదితరులకు ఈ సిరీసు మొదటి రెండు మ్యాచుల్లో సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. వరల్డ్ కప్ ముందు వీరి విషయంలో రిస్క్ వద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ల గైర్హాజరీలో భారత బ్యాటింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత గిల్‌పై (Shubman Gill) ఉంటుంది.

భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ అయ్యే అవకాశం ఉన్న గిల్.. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని బ్యాటుతో అదరగొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆసీస్‌పై (INDvsAUS) గిల్ అదరగొట్టి వరల్డ్ కప్‌లో కాన్ఫిడెంట్‌గా అడుగు పెట్టాలని, అదే సమయంలో బాబర్ నుంచి టాప్ ర్యాంకు కూడా లాగేసుకోవాలని కోరుకుంటున్నారు.

Story first published: Thursday, September 21, 2023, 18:41 [IST]
Other articles published on Sep 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+