INDvsAUS: రోహిత్‌లో రొమాంటిక్ హీరో బయటకొచ్చేశాడు.. వైరల్ అవుతున్న వీడియో!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫ్యామిలీ మ్యాన్ అని తెలిసిందే. భార్యాపిల్లలకు సాధ్యమైనంత సమయం ఇచ్చే రోహిత్.. వరల్డ్ కప్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ కీలక టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో భారత జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే.
వీటిలో తొలి రెండు మ్యాచుల్లో రోహిత్‌కు విశ్రాంతి ఇచ్చారు. అయితే రాజ్‌కోట్ వేదికగా జరిగే చివరి మ్యాచ్‌లో మాత్రం రోహిత్, కోహ్లీ వంటి సీనియర్లు జట్టులో చేరుతున్నారు. ఈ క్రమంలోనే ముంబై నుంచి రాజ్‌కోట్ వెళ్లేందుకు రోహిత్ కూడా రెడీ అయ్యాడు. ఈ సమయంలో కారులో రోహిత్‌ను దిగబెట్టేందుకు అతని భార్య రితిక సజ్దే వచ్చింది.

భార్యను వదిలి వెళ్లే సమయంలో కారులోకి వంగి మరీ ఆమెను రోహిత్ కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత అతన్ని వదిలి ఉండటం ఇష్టం లేనట్లు రితిక మొఖం పెట్టింది. అది చూసిన రోహిత్.. నవ్వుతూ చెయ్యి ఊపి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఇది చాలా రొమాంటిక్‌గా ఉందని, రోహిత్ దంపతులు చాలా అన్యోన్యంగా ఉన్నారని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది మాత్రం రోహిత్‌లోని రొమాంటిక్ హీరో బయటకు వచ్చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక క్రికెట్ విషయానికొస్తే.. చివరగా ఆసియా కప్‌లో రోహిత్ ఆడాడు. ఆ టోర్నీ ఫైనల్‌లో కేవలం 51 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయాల్సి రావడంతో రోహిత్ బ్యాటింగ్ చేయలేదు. శుభ్‌మన్ గిల్‌కు జతకగా కుర్రాడు ఇషాన్ కిషన్‌ను పంపించాడు. వీళ్లిద్దరూ చాలా ఈజీగా టార్గెట్ ఛేజ్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు.
Rohit Sharma on the way to Rajkot for the 3rd ODI. [Viral Bhayani]
— Johns. (@CricCrazyJohns) September 26, 2023
- Cutest video of the day.pic.twitter.com/ysOSoKjEkS
ఇక ఆ తర్వాత మొదలైన ఆస్ట్రేలియా సిరీసులో రోహిత్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఈ సిరీసులో చివరి మ్యాచులో రోహిత్ మళ్లీ బరిలో దిగనున్నాడు. ఆ తర్వాత వరల్డ్ కప్ కోసం జరిగే రెండు వార్మప్ మ్యాచుల్లో అతను ఆడతాడు. ఈ ఏడాది భారత్ కనుక వరల్డ్ కప్ నెగ్గాలంటే రోహిత్ ఫామ్ కూడా టీంకు ముఖ్యమే అని అందరూ భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications