Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS: కీ ప్లేయర్లు లేని టీమిండియా.. టాస్ గెలవడం కీలకం.. తొలి మ్యాచ్ నెగ్గేదెవరు?

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీసు కోసం భారత జట్టు రెడీ అయింది. మొహాలీలోని పీసీఏ స్టేడియం వేదికగా ఈ సిరీసులో తొలి వన్డే జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు కూడా ఈ రెండు జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ సిరీసులో 2-1 తేడాతో నెగ్గిన ఆసీస్.. వరల్డ్ కప్ ముందు కూడా అలాగే నెగ్గి ముందడుగు వేయాలని అనుకుంటోంది.

గాయంతో సౌతాఫ్రికా సిరీసుకు దూరమైన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఆ టీంతో కలిశాడు. ఇక వరల్డ్ కప్ టీంలో ఎంపికైన ట్రావిస్ హెడ్ గాయం కారణంగా భారత్‌తో సిరీసుకు దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానాన్ని మార్నస్ లబుషేన్ భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక ఇటీవల ఆసియా కప్ ట్రోఫీ నెగ్గిన భారత జట్టు.. వరల్డ్ కప్ ముందు బలమైన ఆసీస్‌పై కూడా మెరుగైన ప్రదర్శన చేయాలని అనుకుంటోంది.

INDvsAUS Pitch and Weather report of Mohali stadium in the first ODI

అయితే ఈ మ్యాచులో భారత జట్టు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి కీలకమైన ఆటగాళ్లు లేకుండా బరిలో దిగుతోంది. అదే సమయంలో ఆసీస్ టీం మాత్రం దాదాపు ఫుల్ స్ట్రెంగ్త్ బృందంతో ఆడుతోంది. అదే సమయంలో దాదాపు 20 నెలల తర్వాత రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచులో వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇక పీసీఏ స్టేడియం పిచ్ బ్యాటర్లకు ఎక్కువగా సహకరించే అవకాశం ఉంది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 253 పరుగులు కావడం గమనార్హం. అయితే టాస్ గెలిచిన జట్లు ఎక్కువగా ఛేజ్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన చివరి ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో ఛేజింగ్ టీం నెగ్గింది.

మ్యాచ్ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండనుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ మ్యాచ్ ఎంజాయ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 30 డిగ్రీల దరిదాపుల్లో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఛేజింగ్ టీంకు గెలిచే అవకాశాలు ఉండటంతో టాస్ కీలకం కానుంది.

Story first published: Friday, September 22, 2023, 7:55 [IST]
Other articles published on Sep 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+