వరల్డ్ కప్‌కు సన్నాహకంగా జరుగుతున్న ఆస్ట్రేలియా వన్డే సిరీసులో చివరి మ్యాచ్‌కు సమయం దగ్గర పడింది. తొలి రెండు మ్యాచులకు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ, రోహిత్, హార్దిక్, కుల్దీప్ నలుగురూ ఈ మ్యాచులో ఆడనున్నారు. దీంతో వీరి కోసం ఎవరిని పక్కన పెట్టాలనే చర్చ జరుగుతోంది. ఆసియా గేమ్స్ కోసం రుతురాజ్ గైక్వాడ్ ఈ టీంను వదిలేస్తాడు. అతన్ని రోహిత్ రిప్లేస్ చేస్తాడు. దీనిలో సమస్య లేదు.
అయితే మూడో స్థానంలో కోహ్లీ రాకతో శ్రేయాస్ అయ్యర్ తన స్థానం మార్చుకోవాల్సి ఉంటుంది. అయ్యర్ నాలుగో నెంబర్‌లో వస్తే.. ఆ స్థానంలో రాణిస్తున్న కేఎల్ రాహుల్‌ను ఐదో స్థానంలో పంపాల్సి వస్తుంది. ఆరో నెంబర్‌లో హార్దిక్ పాండ్యా వచ్చేస్తాడు. దీంతో ఇషాన్ కిషన్‌కు బ్యాటింగ్ లైనప్‌లో చోటు దక్కడం అసాధ్యంగా మారుతుంది.

ఈ క్రమంలో ఇండోర్‌లో శతకంతో రాణించిన శ్రేయాస్ అయ్యర్‌ను పక్కన పెట్టాలా? లేక చక్కగా రాణిస్తున్న ఇషాన్ కిషన్‌పై వేటు వేయాలా? అని చర్చ జరుగుతోంది. వీరికితోడు సూర్యకుమార్ యాదవ్ స్థానంపై కూడా పెద్ద క్వశ్చన్ మార్కు వేలాడుతోంది. ఈ క్రమంలో మూడో వన్డేలో జట్టు కూర్పు గురించి లెజెండరీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయం చెప్పాడు.
తొలి రెండు మ్యాచులకు కెప్టెన్సీ వహించిన కేఎల్ రాహుల్‌ను మూడో మ్యాచులో పక్కన పెట్టాలని అతను సూచించాడు. ఈ మ్యాచులో శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్, ఇషాన్ కిషన్ కలిసి టీంకు ఓపెనింగ్ చేస్తారని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఎప్పట్లాగే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడన్నాడు.
లాస్ట్ మ్యాచులో శ్రేయాస్ అద్భుతమైన సెంచరీ సాధించాడని గుర్తుచేసిన భజ్జీ.. ఒక ప్లేయర్ ఫెయిలైతే ప్రపంచం అంతా అతని వెంట పడుతుందని, అయ్యర్ అద్భుతమైన ప్లేయర్ అని అతనికి మద్దతు ఇవ్వాలని సలహా ఇచ్చాడు. తను గాయం నుంచి కోలుకొని వచ్చాడనే విషయం మర్చిపోకూడదని తెలిపాడు. 'మన ప్లేయర్‌కు మద్దతు ఇవ్వకుండా ఫలితం కోసం పరిగెట్టడం కరెక్ట్ కాదు. అందుకే నాలుగో నెంబర్‌లో అయ్యర్ వస్తాడు' అని భజ్జీ చెప్పాడు.
'కేఎల్ రాహుల్ రెండు మ్యాచుల్లో చక్కగా రాణించాడు. కెప్టెన్‌గా రెండు మ్యాచులు గెలిపించాడు. కాబట్టి అతనికి విశ్రాంతి ఇవ్వాలని చెప్తా. సూర్యకుమార్ యాదవ్‌ను ఐదో నెంబర్‌లో, హార్దిక్ పాండ్యాను ఆరో నెంబర్‌లో, రవీంద్ర జడేజాను ఏడో నెంబర్‌లో దించాలి. 8వ బ్యాటర్‌గా కుల్దీప్ యాదవ్, 9వ నెంబర్‌లో మహమ్మద్ షమీ, 10వ నెంబర్‌లో మహమ్మద్ సిరాజ్, ఇక చివరగా జస్‌ప్రీత్ బుమ్రా' అంటున్నాడు భజ్జీ.