వన్డే వరల్డ్ కప్ ముందు సన్నాహకంగా జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీసులో భారత జట్టు టాస్ గెలిచింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌కు ఈ సిరీస్ తొలి రెండు మ్యాచుల్లో విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రోహిత్ గైర్హాజరీలో కేెఎల్ రాహుల్ టీంకు నాయకత్వం వహిస్తున్నాడు.
మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో మహమ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టినట్లు రాహుల్ వెల్లడించాడు. పిచ్ చక్కగా ఉందని, కొన్ని విషయాల్లో జట్టు ఇంకా మెరుగవ్వాల్సి ఉందని రాహుల్ చెప్పాడు. ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ సవాలేనని, ఈ సిరీస్ కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నామని అన్నాడు.

ఆసియా కప్ ఫైనల్ ఆడిన జట్టులో ఐదు మార్పులు చేసినట్లు రాహుల్ తెలిపాడు. రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ ఈ మ్యాచులో ఆడుతున్నట్లు చెప్పాడు. మంచి ఫామ్‌లో ఉన్న సిరాజ్‌ను పక్కన పెట్టినట్లు రాహుల్ తెలిపాడు.సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వడంతోపాటు షమీకి గేమ్ టైం దొరుకుతుందనే ఆలోచనతోనే టీం మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రుతురాజ్ ఓపెనింగ్ చేస్తాడని తెలుస్తోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన రాహుల్.. ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇక్కడ ఛేజింగ్ టీమ్స్ ఎక్కువగా మ్యాచులు గెలిచిన కారణంగానే ఈ డెసిషన్ తీసుకున్నాడని చెప్పాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా తాము టాస్ గెలిచినా ఛేజింగే తీసుకునే వాళ్లమని అన్నాడు.మిచెల్ స్టార్క్ ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేడని చెప్పిన కమిన్స్.. మ్యాట్ షార్ట్ ఈ మ్యాచులో వన్డే అరంగేట్రం చేస్తున్నట్లు చెప్పాడు. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీకి విశ్రాంతి ఇచ్చామని, అతని స్థానంలో జోష్ ఇంగ్లిస్ ఆడుతున్నట్లు తెలియజేశాడు.
భారత జట్టు: శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ,
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ షార్ట్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), షాన్ ఆబాట్, ఆడం జంపా