Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS: 15 కోట్లు దాటేసిన వ్యూయర్ షిప్.. రికార్డులన్నీ బద్దలు కొట్టేసిన జియో సినిమా!

Jio Cinema: ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో జియో సినిమా వ్యూయర్ షిప్ రికార్డులు బద్దలు కొట్టింది. బీసీసీఐతో కొత్త డీల్ తర్వాత తొలి సీజన్‌ను స్ట్రీమింగ్ చేస్తున్న జియోలో మ్యాచులు చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఎగబడ్డారు. ఈ మ్యాచ్ వ్యూయర్‌ షిప్ ఏకంగా 15 కోట్ల మార్కు దాటడం ఆశ్చర్యకర అంశం.

ఎందుకంటే వరల్డ్ కప్‌లో కూడా హాట్ స్టార్ వ్యూయర్‌ షిప్ 5 కోట్ల మార్కు మాత్రమే దాటింది. ఐదు కోట్లు దాటడం చూసినప్పుడే అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ జియో సినిమా ఈజీగా అధిగమించింది. ఏకంగా మూడింతల వ్యూయర్స్‌తో అదరగొట్టింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్.. ముందుగా బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు.

INDvsAUS Jio Cinema witness record breaking 15cr viership during second T20i

ఆ నిర్ణయం ఎంత పెద్ద తప్పో ఇన్నింగ్స్ మొదలైన నిమిషాల్లోనే అతనికి అర్థమైంది. ఎందుకంటే కుర్ర ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆ స్థాయిలో చెలరేగాడు. ఎదుర్కొన్న ప్రతి బంతికీ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను.. ఎడాపెడా బౌండరీలు బాదేశారు. ఈ క్రమంలోనే జైస్వాల్ కేవలం 25 బంతుల్లోనే 53 పరుగులు చేసి రాణించాడు.

అతను అవుటైన తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (52) కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆరంభం నెమ్మదిగా చేసినా కూడా.. ఆ తర్వాత కిషన్ కూడా వరుసగా భారీ షాట్లు ఆడాడు. ఇక క్రీజులో ఎక్కువ సేపు ఉండకపోయినా సూర్యకుమార్ యాదవ్ (10 బంతుల్లో 19) వచ్చీరాగానే భారీ సిక్సర్ బాదాడు. ఒకపక్క వీళ్లంతా చెలరేగుతుంటే అందరికీ మంచి మద్దతు ఇచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (58) కూడా చూడచక్కని ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

ఇక రింకూ సింగ్ (9 బంతుల్లోనే 31 నాటౌట్) గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే. ఇలా భారత బ్యాటర్లు చెలరేగడంతో ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ చూసేందుకు ఎగబడ్డారు. జియో సినిమాలో వస్తున్న ఈ మ్యాచ్.. ఇప్పటి వరకు నమోదైన ఓటీటీ రికార్డులన్నీ బద్దలు కొట్టిందనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ బ్యాటింగ్ చేసిన చివరి ఓవర్లలోనే జియో సినిమా వ్యూయర్‌షిప్ ఏకంగా 10 కోట్లు దాటేసింది.

ఇక ఆ తర్వాత ఈ సంఖ్య ఎక్కడా తగ్గలేదు. భారత బౌలింగ్ వచ్చేసరికి ఇది 15 కోట్ల మార్కు కూడా దాటేసింది. ఈ లెక్కన ఆ ఫ్యూచర్‌లో జియో సినిమా వ్యూయర్ షిప్ మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Story first published: Sunday, November 26, 2023, 21:30 [IST]
Other articles published on Nov 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+