Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS: మావాడు వరల్డ్ కప్‌కు రెడీ.. వార్నర్‌ హాఫ్ సెంచరీపై ఫ్యాన్స్ హ్యాపీ!

భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీసులో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగుతున్నాడు. మొహాలీలో జరిగిన తొలి వన్డే నుంచి రాజ్‌కోట్‌లో మూడో వన్డే వరకు జట్టుకు శుభారంభాలు అందిస్తూనే వచ్చాడు. వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. రాజ్‌కోట్ వన్డేలో అద్భుతంగా ఆడుతూ సెంచరీ చేసేలా కనిపించాడు.

కానీ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతిని స్కూప్ చేయబోయి తడబడ్డాడు. కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అప్పటికి వార్నర్ కేవలం 34 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్‌తో కలిసి తొలి వికెట్‌కు 78 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వరల్డ్ కప్ ముందు ఇలా వార్నర్ ఫామ్ అందుకోవడం ఆసీస్‌కు చాలా సంతోషకరమైన విషయం.

David Warner in full form

ఈ క్రమంలో ఫ్యాన్స్ కూడా వార్నర్‌కు కంగ్రాట్స్ చెప్తున్నారు. అదే సమయంలో అనవసరమైన షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. లేదంటే సెంచరీ చేసుకునే వాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. భారత్‌పై చాలా తక్కువ మంది ప్లేయర్లు మాత్రమే వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేయడం గమనార్హం. 36 ఏళ్ల వయసులో కూడా వార్నర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

ఇప్పటి వరకు భారత్‌లో 25 వన్డేలు ఆడిన వార్నర్ మూడు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలతో 1174 పరుగులు చేశాడు. అక్టోబర్ 8న వరల్డ్ కప్‌లో కూడా భారత్‌తో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో వార్నర్ ఫామ్ అందుకోవడం ఆ టీంకు చాలా పెద్ద పాజిటివ్ అని ఫ్యాన్స్ అంటున్నారు. 'మావాడు వరల్డ్ కప్‌కు రెడీ' అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం వార్నర్ ఫామ్ చూస్తే వరల్డ్ కప్‌లో అతను చాలా ప్రమాదకరంగా మారడం ఖాయమని తెలుస్తోంది. భారత్‌లో ఆడేందుకు ఇష్టపడే వార్నర్.. వరల్డ్ కప్‌లో ఆసీస్‌కు చాలా కీలకం కానున్నాడు. అతనితోపాటు మిచెల్ మార్ష్ కూడా అద్భుతంగా ఆడటంతో ఆసీస్ బ్యాటింగ్ బలం రెండింతలైనట్లు కనిపిస్తోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Story first published: Wednesday, September 27, 2023, 17:02 [IST]
Other articles published on Sep 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+