Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS: ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయాలు ఇవే..!

ఆస్ట్రేలియాతో రెండో టీ20 కోసం టీమిండియా రెడీ అవుతోంది. తిరువనంతపురం వేదికగా ఈ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో కొన్ని విషయాలపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కొందరు ప్లేయర్ల ఆటతీరుపై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

రవి బిష్ణోయి ప్రదర్శన
తొలి టీ20లో రవి బిష్ణోయి ఆశించిన స్థాయిలో రాణించలేదు. మొదటి మ్యాచులో భారత జట్టుకు తొలి బ్రేక్ ఇచ్చింది బిష్ణోయినే. కానీ ఆ తర్వాత అతను తేలిపోయాడు. ఫీల్డింగ్‌లో కూడా అతను తడబడ్డాడు. అదే సమయంలో వెటరన్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్, మయాంక్ మార్కండే వంటి వాళ్ల నుంచి బిష్ణోయికి చాలా పోటీ ఉంది.

INDvsAUS Fans eager to see these things in second T20I

గైక్వాడ్ ఫస్ట్ బాల్
టీమిండియా యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. తొలి టీ20లో ఒక్క బంతి కూడా ఎదుర్కోలేదు. డబుల్ తీసేందుకు ప్రయత్నించిన అతను డైమండ్ డక్‌గా పెవిలియన్ చేరాడు. జైస్వాల్ డబుల్ కోసం పిలవగానే పరిగెత్తిన అతను.. జైస్వాల్ ఆగిపోవడంతో తను వెనక్కు తిరగలేకపోయాడు. దీంతో అవుటైపోయాడు. తొలి మూడు టీ20లకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అతను ఈ మ్యాచులో ఎలా ఆడతాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

వాళ్ల రీఎంట్రీ?
తొలి టీ20లో ఆసీస్ బిగ్ ప్లేయర్లు మ్యాక్స్‌వెల్, వార్నర్, ట్రావిస్ హెడ్ తదితరులు ఆడలేదు. వన్డే వరల్డ్ కప్ ఆడిన ఈ సీనియర్ ప్లేయర్లు విశ్రాంతి తీసుకున్నారు. అయితే స్మిత్, స్టొయినిస్, ఆబాట్, ఇంగ్లిస్ తదితరులు మాత్రం బరిలో దిగి రాణించారు. ముఖ్యంగా ఇంగ్లిస్ చెలరేగాడు. ఆసీస్ మేనేజ్‌మెంట్ ఈ సీనియర్లకు మరింతకాలం రెస్ట్ ఇవ్వాలని అనుకుంటోంది. కానీ రెండో మ్యాచులో వీళ్లు బరిలో దిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఫ్యాన్స్ కూడా వీళ్లు ఆడతారనే అనుకుంటున్నారు.

Story first published: Sunday, November 26, 2023, 17:14 [IST]
Other articles published on Nov 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+