INDvsAUS: ఇదేం కొత్త ఆలోచన కాదు.. వన్డేల్లో అశ్విన్ రీఎంట్రీపై ద్రావిడ్ క్లారిటీ!
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు పిలుపునిచ్చింది. అశ్విన్ చివరగా 2022 జనవరిలో వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత వైట్ బాల్ ఫార్మాట్ ఆడింది లేదు. అలాంటి అతన్ని సడెన్‌గా వరల్డ్ కప్ టీంలోకి తీసుకోవాలని అనుకోవడం, దానికోసం ఆసీస్‌పై ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత అతన్ని నేరుగా వరల్డ్ కప్ కోసం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దీనిపై తాజాగా స్పందించిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. జట్టులో ఎప్పుడు అవకాశం కనిపించినా అశ్విన్‌ను (Ravichandran Ashwin) తీసుకోవడానికి తాము ఎప్పటి నుంచో రెడీగా ఉన్నామని చెప్పాడు.

ఎవరికైనా గాయమైనా, తన అవసరం ఉన్నా అశ్విన్‌ను వన్డే టీంలోకి తీసుకోవడానికి తాము రెడీగా ఉన్నామని ద్రావిడ్ స్పష్టం చేశాడు. అలాగే వన్డేల్లో గ్యాప్ వల్ల తలెత్తే సమస్యను అశ్విన్ తన అనుభవంతో ఈజీగా అధిగమిస్తాడని చెప్పాడు. ఆసియా కప్‌లో అక్షర్ పటేల్ గాయపడిన సంగతి తెలిసిందే.
అతనికి గాయం అవడంతో ఆస్ట్రేలియాతో సిరీసు కోసం అశ్విన్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అతను కనుక ఈ సిరీసులో రాణిస్తే వన్డే వరల్డ్ కప్ టీంలో కూడా అక్షర్ స్థానాన్ని అశ్విన్ (Ravichandran Ashwin) భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఇలా అశ్విన్‌ను ఎంపిక చేయడం వెనుక ఉన్న రీజనింగ్ ఏంటని ద్రావిడ్‌ను ప్రెస్ మీట్‌లో విలేకరులు ప్రశ్నించారు.
'అశ్విన్ వంటి అనుభవం ఉన్న వాళ్లు జట్టులోకి రావడం మాకు ఎప్పుడూ మంచిదే. అనుభవంతోపాటు ఎనిమిదో నెంబర్‌లో బ్యాటుతో రాణించే సత్తా కూడా తనకు ఉంది. ఎవరికైనా గాయాలైనా, ఏమాత్రం అవకాశం ఉన్నా అశ్విన్‌ను టీంలోకి తీసుకోవాలని మేం ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం' అని ద్రావిడ్ వివరించాడు.
'మా ప్లాన్స్‌లో అశ్విన్ ఎప్పుడూ భాగమే. గత కొంత కాలంగా తను అంతగా వన్డే క్రికెట్ ఆడలేదని నాక్కూడా తెలుసు. కానీ అతనికి ఉన్న అనుభవం దృష్ట్యా ఇది అంత పెద్ద సమస్య అనుకోవడం లేదు. దీన్ని అశ్విన్ (Ravichandran Ashwin) సులభంగా అధిగమిస్తాడని అనుకుంటున్నాం' అని ద్రావిడ్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications