భారత్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇక్కడకు వచ్చేసింది. ఆసియా కప్ నెగ్గిన భారత్‌కు ఎక్కువ విశ్రాంతి లేదు. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఇక అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆసీస్ జట్టు మొత్తం భారత్‌కు వచ్చేసింది.
మొహాలీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే జరుగుతుందన్న సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఆసీస్ ఆడే తొలి మ్యాచ్ భారత్‌తోనే. ఈ క్రమంలోనే ఈ సిరీస్‌కు ఆసీస్ టీం చాలా ప్రాధాన్యత ఇస్తోంది. దీని ద్వారా ఇక్కడి పరిస్థితులకు ఆటగాళ్లు అలవాటు పడతారని భావిస్తోంది.

భారత్‌కు చేరుకున్న తర్వాత ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన ఇన్‌స్టాగ్రాంలో ఒక పోస్టు పెట్టాడు. 'భారత్‌కు ఎప్పుడొచ్చినా చాలా గొప్పగా ఉంటుంది. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. మా ప్రయాణం చాలా ఈజీగా సాగేలా చేసినందుకు ధన్యవాదాలు' అంటూ జీఎంఆర్ ఏరోసిటీ సంస్థకు కూడా వార్నర్ థ్యాంక్స్ చెప్పాడు.
తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీసును గొప్పగా ఆరంభించిన వార్నర్.. ఆ తర్వాత చతికిలపడ్డాడు. తొలి రెండు మ్యాచుల్లో 106, 78 స్కోర్లు చేసిన అతను చివరి మూడు మ్యాచుల్లో కనీసం 20 స్కోరు దాటలేకపోయాడు. వరల్డ్ కప్‌లో ఆసీస్‌కు శుభారంభాలు అందించే బాధ్యత వార్నర్‌పై ఉంటుంది. కాబట్టి అతను ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటం ఆ టీంకు చాలా ముఖ్యం.
అలాగే ఆసీస్ స్టార్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్ ముగ్గురూ తమ హోటల్ రూంలో చిల్ అవుతున్న ఫొటోను కీపర్ అలెక్స్ క్యారీ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ మిడిలార్డర్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయితే గాయాలతో జట్టుకు దూరమైన స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ తిరిగి రావడంతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది.
భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా జరుగుతుంది. ఆ తర్వాత 24న ఇండోర్‌లో రెండో వన్డే, 27న రాజ్‌కోట్ వేదికగా మూడో వన్డే జరుగుతుంది. ఈ సిరీస్ గెలిచిన జట్టు వరల్డ్ కప్‌లో కాన్ఫిడెంట్‌గా అడుగు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వరల్డ్ కప్‌లో కూడా ఈ రెండు టీమ్స్ తమ తొలి మ్యాచులో ఈ ప్రత్యర్థినే ఎదుర్కోవాల్సి ఉంది.
ఆసీస్ టీం: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), షాన్ ఆబాట్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లీస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా