'ఏకాంతం కావాలంటే పీఎస్ఎల్ స్టేడియంకు వెళ్దాం'

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇంకా ప్రారంభమే కాలేదు. అప్పుడే ఐపీఎల్‌కు పోటీ అంటూ పీఎస్‌ఎల్‌ను పొగిడేస్తున్నారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 22న మొదలైంది. దీంతో ప్రాంతాల వారీగా మాదంటే మాదంటూ ఐపీఎల్, పీఎస్ఎల్‌లను తెగ మోసేస్తున్నారు. అదే స్థాయిలో వెటకారాలు మొదలెట్టేశారు ఇరు దేశాల నెటిజన్లు.
ప్రస్తుతం దుబాయ్ వేదికగా 3వ సీజన్‌లో లీగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆరంభ వేడుకలకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ పాక్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయారు. ఇప్పుడు భారత్ అభిమానుల వంతు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పీఎస్‌ఎల్‌కు సంబంధించిన ఓ ఫొటో చక్కర్లు కొడుతోంది.
దీనికి భారత క్రికెట్ అభిమానులు భలే కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఈ ఫొటో దేనికి సంబంధించినది అంటే.. ఓ మ్యాచ్ జరుగుతుండగా తీసిన ఫొటో. ఇందులో మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. గ్యాలరీలన్ని ఖాళీగానే కనిపించాయి.
దీంతో భారత అభిమానులు.. మా ఐపీఎల్ జరిగే సమయంలో గ్యాలరీలు ఖాళీగానే కనిపించవు. ఎప్పుడూ అభిమానులతో నిండిపోయే ఉంటాయి. మీలా కాదు అంటూ చురకలు అంటించారు. 'భూమిపై మనుషులు అత్యల్పంగా కనిపించే ప్రదేశాల్లో పీఎస్‌ఎల్ జరిగే చోటు ఒకటి; ఐపీఎల్ vs పీఎస్‌ఎల్, మీ లీగ్‌లో ఛీర్ లీడర్స్ కూడా లేరు' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఇంకో సరదా ట్వీట్ ఏమంటే అమ్మాయి తనను ముద్దాడాలంటే ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లమంటూ అబ్బాయికి చెప్తుంది. అప్పుడు అతను పీఎస్ఎల్ స్టేడియంకు తీసుకెళ్లాడట.
దాయాది దేశం 2015 నుంచి ఐపీఎల్‌ను ప్రేరణగా తీసుకుని పీఎస్ఎల్‌ను ప్రారంభించింది. ఇటువంటివే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మొదలుపెట్టినా ఆశించనంత ఫలితం సంపాదించుకోలేకపోయాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications