Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: ఇందిరా నగర్‌ గూండాతో శిఖర్‌ ధావన్‌! హలో చెప్పండి!!

Indira nagar ka Gunda with Gabbar: Rahul Dravid and Shikhar Dhawans image Goes Viral

హైదరాబాద్: శిఖ‌ర్ ధావ‌న్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు సోమ‌వారం శ్రీలంక పర్యటన కోసం వెళ్లింది. ఈ విష‌యాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) త‌న ట్విట‌ర్‌లో వెల్ల‌డించింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో భారత బృందం లంకకు వెళ్లింది. ఈ టూర్‌లో భాగంగా భారత్, శ్రీలంక జట్లు 3 వ‌న్డేలు, 3 టీ20ల్లో త‌ల‌ప‌డ‌నున్నాయి. జులై 13 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు ధావ‌న్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. తొలిసారి వ‌చ్చిన ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని గబ్బర్ భావిస్తున్నాడు.

కోచ్‌గా ద్రవిడ్‌:

ఇక శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు కోచ్‌గా టీమిండియా మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)హెడ్ రాహుల్‌ ద్రవిడ్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఆదివారం రాత్రి బీసీసీఐ ఓ ట్వీట్‌ చేసింది. 'శ్రీలంక పర్యటనలో భారత జట్టు కోచ్‌, కెప్టెన్‌కు హలో చెప్పండి. మాకెంతో ఉత్కంఠగా అనిపిస్తోంది. మరి మీకు?' అని కాప్షన్ పెట్టి.. రాహుల్‌ ద్రవిడ్‌, శిఖ‌ర్ ధావ‌న్ ఉన్న ఫొటోను జతచేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.

 ఇందిరా నగర్‌ గూండాతో గబ్బర్‌:

ఇందిరా నగర్‌ గూండాతో గబ్బర్‌:

టీమిండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడే సరైన వ్యక్తి అని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోచ్‌గా మిస్టర్‌ డిపెండబుల్‌ తప్పక రాణిస్తాడని వారు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఆటగాడిగా అదరగొట్టిన శిఖర్‌ ధావన్‌.. కెప్టెన్‌గానూ మంచి పేరు తెచ్చుకుంటాడని అభిమానులు అంటున్నారు. 'రాహుల్‌ ద్రవిడ్‌.. భారత్‌ అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న కోచ్‌' అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అభిమానులు మీమ్స్‌తో అలరిస్తున్నారు. 'ఇందిరా నగర్‌ గూండాతో గబ్బర్‌' అని పేర్కొన్నారు. 'ఇంద్రా నగర్‌ గూండా నేను' అంటూ రాహుల్ ద్రవిడ్‌ ఇటీవల ఓ ప్రకటనలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

2018 తర్వాత:

2018 తర్వాత:

జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. కఠిన బయో బబుల్ నేపథ్యంలో ఈ సిరీస్‌లు ప్రేక్షకుల్లేకుండానే జరగనున్నాయి. 2018 నిదహాస్ తర్వాత భారత్ తొలిసారి శ్రీలంకలో పర్యటిస్తుండటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. వన్డేలు మధ్యాహ్నం 1:30 గంటలు, టీ20లు రాత్రి 7 గంటలకు మొదలవుతాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో అన్ని మ్యాచులు జరుగుతాయి.

శ్రీలంక టూర్‌కు వెళ్లిన టీమ్:

శిఖ‌ర్ ధావ‌న్‌, పృథ్వీ షా, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌, రుతురాజ్ గైక్వాడ్‌, సూర్య‌కుమార్ యాద‌వ్, మ‌నీష్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీష్ రాణా, ఇషాన్ కిష‌న్‌, సంజు శాంస‌న్‌, యజువేంద్ర చహ‌ల్‌, రాహుల్ చ‌హర్‌, కృష్ణప్ప గౌతమ్‌, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాద‌వ్, వ‌రున్ చ‌క్ర‌వ‌ర్తి, భువ‌నేశ్వ‌ర్‌ కుమార్‌, దీప‌క్ చ‌హ‌ర్‌, న‌వ్‌దీప్ సైనీ, చేత‌న్ స‌కారియా.

Story first published: Monday, June 28, 2021, 15:31 [IST]
Other articles published on Jun 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+