For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN T20 Series: నితీశ్‌కు చోటు.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. తెలుగు కుర్రాడు, యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నాడు. జులైలో జరిగిన జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు నితీశ్ ఎంపికయ్యాడు. కానీ గాయం కారణంగా జింబాబ్వేకు బయలుదేరకముందే జట్టు నుంచి వైదొలగాల్సి వచ్చింది.

శ్రీలంక పర్యటన సమయానికి నితీశ్ ఫిటెనెస్ సాధించలేదు. అయితే పూర్తిగా కోలుకుని దులీప్ ట్రోఫీలో ఆడాడు. ఆకట్టుకునే ప్రదర్శన చేయనప్పటికీ సెలక్టర్లు నితీశ్‌కు అవకాశం ఇచ్చారు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున చివరిసారిగా ఆడిన వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో వేగంగా బంతులు సంధించి సంచలనం సృష్టించిన పేస్ గుర్రం మయాంక్ యాదవ్‌ కూడా ఎంపికయ్యాడు.

India s T20I Squad for Bangladesh Series Announced Nitish Reddy Mayank Yadav Earn Maiden Call-Ups

సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మ కూడా టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్‌కు విశ్రాంతి ఇచ్చారు. టీమిండియాలో తిరిగి చోటు దక్కుతుందనుకున్న ఇషాన్ కిషన్‌కు నిరాశే ఎదురైంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్‌, అవేశ్ ఖాన్‌లను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

అక్టోబర్ 6 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. గ్వాలియర్ వేదికగా తొలి టీ20 జరగనుంది. అక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా రెండో మ్యాచ్, అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా ఆఖరి టీ20 జరగనుంది.

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్.

Story first published: Saturday, September 28, 2024, 22:29 [IST]
Other articles published on Sep 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+