Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: రోహిత్‌కే పగ్గాలు.. శాంసన్‌కు ఛాన్స్.. టీమిండియాను ప్రకటించిన బీసీసీఐ

ఊహించిందే జరిగింది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని అఫ్గానిస్థాన్ సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేశారు. దాదాపు 14 నెలల తర్వాత రోహిత్ శర్మ పొట్టిఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి అందుకున్నాడు. అలాగే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. వీరిద్దరు 2022లో టీ20 వరల్డ్ కప్‌లో చివరిగా భారత్ తరపున టీ20 ఆడారు.

16 మందితో కూడా భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్,టెస్టు సిరీస్ ఆడిన వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు విశ్రాంతిని ఇచ్చారు. దీంతో వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేశ్ శర్మ జట్టులో చోటు సంపాదించుకున్నారు. అలాగే జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ కూడా విశ్రాంతిని ఇచ్చారు. మరోవైపు గాయాలతో హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, మహ్మద్ షమి జట్టుకు దూరమయ్యారు.

Indias T20i squad against Afghanistan: Virat Kohli and Rohit Sharma back to T20Is

అయితే లెగ్ స్పిన్నర్ చాహల్‌కు నిరాశే మిగిలింది. చాహల్‌కు బదులుగా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కే సెలక్టర్లు మరోసారి అవకాశం ఇచ్చారు. యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. అయితే ఆల్‌రౌండర్ శివమ్ దూబె ఛాన్స్ దక్కించుకున్నాడు.

కాగా, జనవరి 11 నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. మొహాలి వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్ వేదికగా జనవరి 14న రెండో టీ20, బెంగళూరు వేదికగా జనవరి 17న ఆఖరి మ్యాచ్ జరగనుంది

భారత జట్టు వివరాలు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్

Story first published: Sunday, January 7, 2024, 19:37 [IST]
Other articles published on Jan 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+