Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: నితీశ్‌, అభిషేక్‌కు చోటు.. టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే!

మరో వారం రోజుల్లో బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టు ఖరారు అయినట్లు తెలుస్తోంది. సీనియర్లను కొనసాగిస్తూ యువకులకు మరోసారి సెలక్టర్లు పెద్దపీట వేసినట్లు సమాచారం. టీమిండియాలోకి రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఇషాన్ కిషన్‌కు నిరాశే మిగలనుంది.

ప్రముఖ జాతీయ మీడియా అందించిన నివేదిక ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మందితో కూడిన భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రిషభ్ పంత్‌కు విశ్రాంతి ఇవ్వడంతో వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేశ్ శర్మ చోటు దక్కించుకున్నారు. శుభ్‌మన్ గిల్‌‌కు రెస్ట్ ఇవ్వడం, ఇరానీ కప్‌లో రుతురాజ్ గైక్వాడ్ బిజీగా ఉండటంతో అభిషేక్ శర్మకు ఓపెనర్‌గా చోటుదక్కింది.

India s T20 Series Against Bangladesh Nitish Kumar Reddy and Abhishek Sharma Likely to Feature

ఓపెనర్లు అభిషేక్, యశస్వీ జైస్వాల్‌‌ ఎంపిక అయ్యారు. బ్యాకప్ ఓపెనర్‌గా, ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా శాంసన్ సెలక్ట్ అయ్యాడు. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్య, శివమ్ దూబెతో పాటు తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వే టీ20 సిరీస్‌కు నితీశ్ ఎంపికైనప్పటికీ గాయం కారణంగా వైదొలగాల్సి వచ్చింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ సమయానికి నితీశ్ పూర్తిగా కోలుకోలేదు.

ఇటీవల పూర్తి ఫిట్‌నెస్ సాధించి దులీప్ ట్రోఫీలో ఆడాడు. దాంతో బంగ్లాతో టీ20 సిరీస్‌కు నితీశ్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణాకు కూడా చోటు దక్కింది. అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్‌లతో హర్షిత్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు అందుకోనున్నాడు. అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్‌తో భారత్ మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది.

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి.

Story first published: Saturday, September 28, 2024, 9:39 [IST]
Other articles published on Sep 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+