స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను 280 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. అదే జోరులో రెండో టెస్టులోనూ ఘనంగా నెగ్గి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. అయితే శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న ఆఖరి టెస్టులో భారత తుదిజట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
స్పిన్‌కు స్వర్గధామంగా ఉండే చెపాక్ పిచ్‌పై భారత్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా పర్యటనకు సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో పాటు ఆకాశ్ దీప్‌ను తుది జట్టులోకి తీసుకున్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఆకాశ్ దీప్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి వేసిన ఓవర్లు 11 మాత్రమే. తొలి ఇన్నింగ్స్‌లో అయిదు ఓవర్లు బౌలింగ్ చేశాడు.వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు.

మరోవైపు బుమ్రా 21 ఓవర్లు, సిరాజ్ 20 ఓవర్లు బౌలింగ్ చేశారు. తొలి టెస్టులో క్రమంగా పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో రోహిత్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకే ఎక్కువగా బంతిని అందించాడు. ఈ స్పిన్ జోడీ 56 ఓవర్లు బౌలింగ్ చేశారు. అశ్విన్ ఒక్కడే సెకండ్ ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లు బౌలింగ్ చేయడం గమనార్హం.
కాగా, రెండో టెస్టు వేదిక అయిన కాన్పూర్ కూడా స్పిన్‌కు గొప్పగానే అనుకూలిస్తుంది. దీంతో ఆఖరి టెస్టులో బౌలింగ్ దళంలో మార్పులు చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఆకాశ్ దీప్ స్థానంలో అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకురావాలని చూస్తోంది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ జట్టుకు మరింత విలువ జోడించగలడు. కాన్పూర్ వేదికగా భారత్ ఆడిన చివరి టెస్టులో అక్షర్ న్యూజిలాండ్‌పై ఆరు వికెట్లు (5/62, 1/23) సాధించాడు.
బంగ్లాదేశ్ భారత్ ఆడే తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.