బంగ్లాదేశ్‌ను టెస్టు, టీ20 ఫార్మాట్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ స్వదేశంలో మరో సిరీస్‌కు సిద్ధమైంది. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడానికి అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం కానుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
మరోవైపు శ్రీలంక పర్యటనలో ఘోరపరాజయం చవిచూసిన న్యూజిలాండ్ ఈ సిరీస్‌ను అయినా దక్కించుకోవాలని పట్టుదలతో సన్నద్ధమవుతోంది. గాయం కారణంగా కీలక బ్యాటర్ కేన్ విలియమ్సన్ దూరమవ్వడం కివీస్‌కు ప్రతికూలంగా మారింది. అయితే భారత గడ్డపై ఇప్పటివరకు న్యూజిలాండ్ ఒక్కసారి కూడా వన్డే, టెస్టు సిరీస్ గెలవలేదు. మొత్తంగా ఇప్పటివరకు ఇరు జట్లు 62 టెస్టుల్లో తలపడగా భారత్ 22, న్యూజిలాండ్ 13 గెలిచాయి. 27 టెస్టులు డ్రాగా ముగిశాయి.

కాగా, స్వదేశంలో మన ముందు న్యూజిలాండ్ ఫేవరేట్ కాకపోయినప్పటికీ తేలికగా తీసుకోకూడదని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు విషయంలో జాగ్రత్త వహిస్తోంది. శ్రీలంక పర్యటనలో స్పిన్నర్ల ముందు కివీస్ బ్యాటర్ల నిలవలేకపోయారు. ఈ క్రమంలో ముగ్గరు స్పిన్నర్లతో జట్టులోకి దిగాలని భారత్ భావిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాతో పాటు కుల్‌దీప్ యాదవ్ తుదిజట్టులోకి రానున్నాడు. అక్షర్ పటేల్‌ను తీసుకోవాలనే యోచనలో మేనేజ్మెంట్ ఉంది. అయితే ఆల్‌రౌండర్‌ను కాకుండా స్పెషలిస్టు స్పిన్నర్‌పైనే మొగ్గుచూపనుంది.
ఇటీవల ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్‌కు నిరాశే మిగలనుంది. అతనికి ఈసారి కూడా తుదిజట్టులో స్థానం దక్కే అవకాశం కనిపించట్లేదు. కేఎల్ రాహుల్‌ను కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావించడంతో సర్ఫరాజ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అలాగే రిషభ్ పంత్ ప్రధాన వికెట్ కీపర్‌గా కొనసాగడంతో ధ్రువ్ జురెల్ కూడా తుదిజట్టులో స్థానం కోసం ఎదురుచూడాల్సి ఉంది.
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ తరహాలో ముగ్గురు పేసర్లతో కాకుండా ఇద్దరినే తుదిజట్టులోకి తీసుకోవాలని గంభీర్-రోహిత్ భావిస్తున్నారు. ఈ క్రమంలో బుమ్రా, సిరాజ్ పేస్ బాధ్యతలు మోయనున్నారు. ఆకాశ్ దీప్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.