Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: కివీస్ చేతిలో అదే తడబ్యాటు.. టీమిండియా చెత్త రికార్డు!

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో ‌జరుగుతున్న తొలి టెస్టు‌లో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. స్టార్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 10 ఓవర్లలోపే 10 పరుగులకు భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (2; 16 బంతుల్లో), విరాట్ కోహ్లి (డకౌట్; 9 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (డకౌట్; 3 బంతుల్లో) వరుసగా పెవిలియన్‌కు చేరారు.

కెప్టెన్ రోహిత్‌ను సౌథి స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి ఒరుర్కె వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన కోహ్లి గ్లెన్ ఫిలిప్స్ చేతికి చిక్కాడు. కాస్త ఎక్స్‌ట్రా బౌన్స్ అయిన బంతిని డిఫెండ్‌కు ప్రయత్నించి లెగ్ గల్లీలో ఉన్న ఫిలిప్స్‌కు దొరికిపోయాడు. మరోవైపు మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఔటయ్యాడు. షాట్‌కు యత్నించిన సర్ఫరాజ్ ఎక్సట్రా కవర్‌లో ఉన్న కాన్వే‌కు చిక్కాడు.

India s Home Collapses 3 Wickets for 10 Runs or Fewer Against New Zealand Since 1990

అయితే 1990 తర్వాత సొంతగడ్డపై భారత్ 10 పరుగుల లేదా అంతకంటే తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోవడం ఇది మూడోసారి. మూడు సార్లు న్యూజిలాండ్ చేతిలోనే ఈ పేలవ ప్రదర్శన చేయడం గమనార్హం. 1999లో మోహాలి వేదికగా జరిగిన టెస్టులో ఏడు పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. 2010లో అహ్మదాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగులకు మూడు వికెట్లను చేజార్చుకుంది. అదే తడబ్యాటుతో మరోసారి వికెట్లు కోల్పోయింది.

ఇక 2018 తర్వాత భారత్ మూడు వికెట్లు కోల్పోయిన అత్యల్ప స్కోరు ఇదే. అంతకుముందు ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కాగా, ప్రస్తుతం భారత్ 12 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (8; 37 బంతుల్లో), రిషభ్ పంత్ (3; 8 బంతుల్లో) ఉన్నారు. సౌథి, హెన్రీ, ఒరుర్కె తలో వికెట్ తీశారు.

Story first published: Thursday, October 17, 2024, 11:30 [IST]
Other articles published on Oct 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+