క్యాచ్ వదిలి భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
హైదరాబాద్: ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో టీమిండియా జట్టు ఫీల్డింగ్‌పై కోచ్ ఉన్న ఆర్. శ్రీధర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో ఇప్పటికే టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇంకో టెస్టు మ్యాచ్ మిగిలుండగానే టెస్టు సిరిస్‌ను ముందుగానే గెలుచుకున్నప్పటికీ, చెన్నైలో జరుగుతున్న ఐదో టెస్టు తొలిరోజున భారత ఆటగాళ్లు క్యాచ్‌లను వదిలేయడం కనను నిరాశకు గురి చేసిందని చెప్పాడు. క్యాచ్‌లను పట్టేక్రమంలో టైమింగ్ చాలా ముఖ్యమని ఆటగాళ్లకు హితబోధ చేశాడు.
మైదానంలో ఫీల్డింగ్ చేసేటప్పుడు తప్పులు జరగడం సహజమంటూనే, భారత ఆటగాళ్లు ఫీల్డింగ్ విభాగంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. తొలి రోజు ఆటలో భాగంగా మెయిల్ అలీ క్యాచ్‌ని పట్టి పెవిలియన్‌కు చేర్చి ఉంటే మ్యాచ్ పై పట్టుదొరికేదని తెలిపాడు.

ఫీల్డింగ్ విభాగంలో టీమిండియా ఘోరంగా వైఫల్యం
ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరిస్‌లో మాత్రం ఫీల్డింగ్ విభాగంలో టీమిండియా ఘోరంగా వైఫల్యం చెందిందని తెలిపాడు. రాజ్ కోట్‌లో ముగిసిన తొలి టెస్టు డ్రా అవడానికి కారణం ఆ టెస్టులో ఏడు క్యాచ్‌లను టీమిండియా వదిలేయడమేనని తెలిపాడు. అదే క్యాచ్‌లను పట్టుకుని ఉంటే మ్యాచ్ ఫలితమే తారుమారయ్యేదని వెల్లడించాడు.

రెండో టెస్టులో నాలుగు క్యాచ్‌లు
ఆ తర్వాత మొహాలీలో జరిగిన రెండో టెస్టులో నాలుగు క్యాచ్‌లను కూడా భారత ఆటగాళ్లు జారవిడిచిన సందర్భాన్ని సైతం గుర్తు చేశాడు. క్యాచ్‌లను పట్టడంలో వెనుకబడిన పక్షంలో మ్యాచ్ ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరిస్‌లో బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నా ఫీల్డింగ్‌లో పేలవంగా ఉంది.

ఐదో టెస్టులో ఒక కీలకమైన క్యాచ్
కాగా, 4-0తో సిరీస్ గెలిచి రికార్డును తిరగరాయాలన్న టీమిండియా ఐదో టెస్టులో ఒక కీలకమైన క్యాచ్‌ను వదిలేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు మొయిన్ అలీ పరుగులేమీ చేయకుండా ఉన్న తరుణంలో మొయిన్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ జారవిడిచాడు. తనకు లభించిన లైఫ్‌ను అలీ చక్కగా సద్వినియోగం చేసుకుని సెంచరీ సాధించాడు.

కాగా, 4-0తో సిరీస్ గెలిచి రికార్డును తిరగరాయాలన్న టీమిండియా ఐదో టెస్టులో ఒక కీలకమైన క్యాచ్‌ను వదిలేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు మొయిన్ అలీ పరుగులేమీ చేయకుండా ఉన్న తరుణంలో మొయిన్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ జారవిడిచాడు. తనకు లభించిన లైఫ్‌ను అలీ చక్కగా సద్వినియోగం చేసుకుని సెంచరీ సాధించాడు.
అంతేకాదు ఐదో టెస్టు తొలిరోజు ఇంగ్లాండ్ పైచేయి సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 203 బంతులను ఎదుర్కొన్న అలీ 9 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో మెయిల్ అలీకి ఇది ఐదో సెంచరీ. 284/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అలీ 146 పరుగులు చేసి అవుటయ్యాడు.

146 పరుగుల వద్ద అలీ పెవిలియన్‌కు
శనివారం ఉదయం ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అలీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 262 బంతులు ఆడిన మోయిన్ అలీ 13 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 146 పరుగులు చేసి ఇంగ్లాండ్ జట్టుని పటిష్టస్థితికి చేర్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications