Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పటి సచిన్ కాడు: ఆఫ్రిదీ

Afridi
జోహన్స్ బర్గ్: భారత క్రికెట్ జట్టు బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ నుంచి ఏ మాత్రం ప్రమాదం లేదని, సచిన్ గురించి తాము భయపడడం లేదని పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ షాహిద్ ఆప్రిదీ అన్నారు. ఐసిసి పోటీల్లో ఇంతకు ముందు తమను ఓడించడం పాకిస్తాన్ అదృష్టమని ఆయన అన్నారు. తాము ఇప్పుడు దాన్ని మార్చేస్తామని ఆయన అన్నారు. సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ కు ఇప్పటికీ ముప్పుగానే ఉన్నాడా అని అడిగితే మీరు 2003లో సచిన్ గురించి మాట్లాడుతున్నారని, ఇది 2009 అని ఆయన వ్యాఖ్యానించారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న పాక్ క్రికెట్ జట్టుకు ఆఫ్రిదీ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ గ్రూప్ బిలో భారత్ తో శనివారం సెంచూరియన్ లో తలపడుతోంది. 2003 ప్రపంచం కప్ లో కన్నా తమ జట్టు ఇప్పుడు పటిష్టంగా ఉందని, అప్పటికి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని ఆయన అన్నారు. బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లోనూ తమ జట్టు పటిష్టంగా ఉందని ఆయన చెప్పుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా జట్లకు తమ జట్టు ఏ మాత్రం తీసిపోదని ఆయన అభిప్రాయపడ్డారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+