Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారతీయులు విశాల హృదయులు కారు: పాకిస్తాన్ కెప్టెన్ ఆఫ్రిదీ

ఇస్లామాబాద్: ప్రపంచ కప్ సెమీ ఫైనల్ పోటీలో ఓటమి తర్వాత చేసిన ప్రకటనకు భారతీయుల హృదయాలను గెలుచుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ మాట మార్చారు. భారతీయులు విశాల వృదయులు కారని ఆయన వ్యాఖ్యానించారు. భారత మీడియాపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. తమ పట్ల భారతీయ మీడియా వ్యతిరేక వైఖరిని తీసుకుందని ఆయన విమర్శించారు. భారత మీడియా కన్నా పాకిస్తాన్ మీడియా వంద రెట్లు ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు.

తాను నిజం చెప్పాల్సి ఉంటుందని, భారతీయులు పాకిస్తానీల మాదిరిగా, ముస్లింల మాదిరిగా విశాల హృదయులు కారని ఆయన అన్నారు. గత 60 ఏళ్లలో తాము ఎన్నిసార్లు స్నేహానికి ప్రయత్నించామో, ఎన్నిసార్లు తమకు చేదు అనుభవం ఎదురైందో చూస్తే ఆ విషయం అర్థమవుతుందని ఆయన ఓ టీవీ చానెల్‌తో అన్నారు. పరస్పరం కలహించకోవడం తమకు ఇష్టం లేదని, కానీ ఎవరు సంబంధాలను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారో మూడో దేశానికి తెలుసునని ఆయన అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పవడవద్దంటూ పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్ తనకు పదే పదే ఫోన్ చేయడాన్ని కూడా ఆయన విమర్శించారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+