సిడ్నీ/న్యూఢిల్లీ: తనను భారతీయులు ఇప్పటికీ క్షమించరని ఆస్ట్రేలియా మాజీ పేస్ దిగ్గజం గ్లేన్ మెక్ గ్రాత్ అన్నాడు. ఎందుకంటే.. 2003 ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 360 పరుగుల లక్ష్యఛేదనలో సచిన్ 4 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ వికెట్‌ను పడగొట్టినందుకు తనను భారత అభిమానులు ఇప్పటికీ క్షమించరని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు.
'ఓపెసర్‌గా సచిన్‌తో పోరాటాన్ని గొప్పగా ఆస్వాదించాను. ప్రత్యేకించి 2003 వరల్డ్‌కప్ ఫైనల్లో. తొలి ఓవర్లోనే సచిన్ నేను వేసిన బంతిని ఫోర్ కొట్టాడు. అయితే తర్వాత బంతిని షార్ట్‌పిచ్‌గా వేశాను. తడబడ్డ సచిన్ నేరుగా నాకే క్యాచ్ ఇచ్చాడు' అని నాటి సంగతిని మెక్‌గ్రాత్ గుర్తుచేసుకున్నాడు.

ఇక సచిన్‌ను ఔట్‌చేసిన మరో చారిత్రక సందర్భాన్నీ మెక్‌గ్రాత్ మననం సుకున్నాడు. ఇది కూడా అభిమానులకు బాగానే గుర్తు. అదే, 1999 అడిలైడ్ టెస్టులో మెక్‌గ్రాత్ షార్ట్‌పిచ్ బంతిని తప్పించుకునే యత్నంలో బంతి సచిన్ భుజానికి తగిలితే అంపైర్ ఔటివ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. దీన్ని సచిన్ తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మైవే'లో రాసుకున్నాడు కూడా.
అయితే, ఈ వివాదాస్పద ఔట్‌ను మెక్‌గ్రాత్ సమర్థించాడు. 'ఈ ఔట్‌పై సచిన్ అభిప్రాయాన్ని అతని ఆత్మకథలో చదివాను. సచిన్ అభిప్రాయంతో నేను ఏకీభవించను. సచిన్ చాలా పొట్టి. అతని భుజానికి బంతి తగిలినప్పుడు నాకు బెయిల్స్ స్పష్టంగా కనిపించాయి' కూడా అని మెక్‌గ్రాత్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం స్లెడ్జింగ్ చాలా చెడు ప్రభావం చూపేదిగా తయారైందని, వ్యక్తిగత దూషణలకు దారితీస్తోందని మెక్ గ్రాత్ అన్నాడు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పాడు.