
హైదరాబాద్: దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు ట్వంటీ20 సిరీస్‌లోనూ తమ సత్తా చాటుతోంది. శుక్రవారం జరిగిన రెండో టీ20లోనూ సఫారీలపై హర్మన్ ప్రీత్ కౌర్ సేన 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈస్ట్ లండన్‌లో బఫెలో పార్క్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓపెనర్లు స్మృతీ మంధాన(57), మిథాలీ రాజ్ (76 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ విజయం నల్లేరు మీద నడకగా మారింది. రెండో టీ20 విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-0తో భారత్ ఆధిక్యంలో నిలిచింది.
తీవ్రంగా శ్రమించిన భారత్ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి సఫారీ జట్టు ఏడు వికెట్లు మాత్రమే తీయగలిగింది. మొదటి మ్యాచ్ ఓడిపోవడంతో సఫారీ జట్టు వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడి భారత జట్టుకు 143పరుగల విజయ లక్ష్యాన్ని ఇచ్చింది.
సఫారీ గడ్డపై మహిళల జట్టు, కోహ్లీసేన కలిసి పోటీకి సిద్ధమయ్యాయి. కోహ్లీ సేన ఆరో వన్డేల సిరీస్‌లో ఆఖరి వన్డే ఆడుతుంటే మహిళల జట్టు రెండో టీ 20 మ్యాచ్‌కు సిద్ధమైంది. మొదటి టీ20లోనూ ఘన విజయం సాధించిన మహిళల జట్టు రెండో టీ 20కి అదే విజయాన్ని ఆశిస్తూ బరిలోకి దిగనుంది.
శుక్రవారం జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల మధ్య సమరం భారత కాలమానం ప్రకారం నాలుగున్నర గంటలకు మొదలుకానుంది.
Teams:
South Africa Women (Playing XI): Lizelle Lee(w), Dane van Niekerk(c), Sune Luus, Mignon du Preez, Nadine de Klerk, Chloe Tryon, Marizanne Kapp, Ayabonga Khaka, Moseline Daniels, Shabnim Ismail, Raisibe Ntozakhe
India Women (Playing XI): Mithali Raj, Smriti Mandhana, Harmanpreet Kaur(c), Veda Krishnamurthy, Radha Yadav, Anuja Patil, Jemimah Rodrigues, Taniya Bhatia(w), Shikha Pandey, Pooja Vastrakar, Poonam Yadav