India tour of Srilanka: మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనున్న వుమెన్స్ టీం, షెడ్యూల్, జట్ల వివరాలు

హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు జూన్ 23నుంచి పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం శ్రీలంకకు వెళ్లింది. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో భారత యువ జట్టు వరుసగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి వంటి వారు లేకుండా టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుండడం గమనార్హం. మిథాలి రాజ్ రిటైర్మెంట్ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ వన్డే ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఎంపికైంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఆదివారం శ్రీలంక క్రికెట్ నిర్వాహకులు భారత క్రికెట్ జట్టుకు స్వాగతం పలికారు.
ఇక ఇండియా జట్టుకు రమేశ్ పొవార్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. శ్రీలంకకు బయలుదేరే ముందు భారత జట్టు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన శిబిరంలో పాల్గొంది. అలాగే NCA హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో జట్టు సభ్యులు భేటి అయ్యారు. ఇక జూన్ 23న టీ20 సిరీస్‌లో భారత శ్రీలంక టూర్ ప్రారంభమవుతుంది. టీ20 మ్యాచ్‌లు జూన్ 23, 25, 27 తేదీల్లో జరగనుండగా.. వన్డే సిరీస్‌లో భాగంగా జూలై 1, 4, 7తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి.
టీ20మ్యాచ్‌లు దంబుల్లా వేదికగా జరగనుండగా.. మూడు వన్డేలు పల్లెకెలె స్టేడియంలో జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు Sony ESPNలో ప్రసారమవుతాయి. Sonyliv యాప్‌లో కూడా మ్యాచ్‌లు లైవ్‌గా చూడొచ్చు. టీ20 మ్యాచ్‌లు మధ్యాహ్నం 2.30కు ప్రారంభం కానుండగా.. వన్డేలు ఉదయం 10గంటలకు ప్రారంభమవుతాయి.
భారత టీ20 వుమెన్స్ టీం: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), ఎస్. మేఘన, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గయక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూజనా వస్త్రాకర్ సింగ్, రేణుకా సింగ్, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్.
భారత వన్డే వుమెన్స్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), ఎస్ మేఘన, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గయాక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్ (వికె), పూజానా వస్త్రాకర్, మేఘనా వస్త్రాకర్ సింగ్, రేణుకా సింగ్, తానియా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications