Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే సిరిస్ భారత్‌దే: సత్తా చాటిన మిథాలీ సేన

మూలపాడు: ఐసీసీ ఛాంపియన్ షిప్‌లో భాగంగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత మహిళల జట్టు 2-0తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండిస్‌పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.

విజయవాడకు సమీపంలోని మూలపాడులో నిర్మించిన కొత్త స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది. విండిస్ టాప్ ఆర్డర్‌ను భారత బౌలర్లు సమర్ధవంతంగా కట్టడి చేశారు.

Indian Women's Cricket Team Steamrolls West Indies to Wrap up ODI Series

టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవ్వడంతో మిడిల్‌లో దిగిన కెప్టెన్ డాటిన్ (63) అర్ధసెంచరీ ఇన్నింగ్స్‌తో వెస్టిండిస్ గౌరవప్రదమైన స్కోరుని అందుకుంది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, ఏక్తా బిస్త్ చెరో 2 వికెట్లు తీయగా, శిఖా పాండే, రాజేశ్వరిలు తలో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 154 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 58 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోరుు కష్టాల్లో పడింది. 23 పరుగులకే తిరుశ్ కామిని(2) రూపంలో తొలి వికెట్ చేజార్చుకున్నా.. మందన(44), దీప్తిశర్మ(32) పరుగులతో ఆకట్టుకున్నారు.

Indian Women's Cricket Team Steamrolls West Indies to Wrap up ODI Series

ఈ క్రమంలో శర్మ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీరాజ్(45) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. వెస్టిండిస్ బౌలర్లలో షకీరా సెల్మాన్, హేలీ, అఫీ ఫ్లెచర్, అనీసా తలా వికెట్ తీసుకున్నారు. మూడు వన్డేల సిరిస్‌లో చివరిదైన ఆఖరి వన్డే మంగళవారం (నవంబర్ 16)న ఇక్కడే జరగనుంది.

స్కోరు వివరాలు: వెస్టిండిస్ 50 ఓవర్లకు గాను 153/7 (Dottin 63; Goswami 2/28, Bisht 2/28). 38 ఓవర్లకు గాను భారత్ 154/5 (Mandhana 44, Raj 45; Selman 1/18).

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+