For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ భారత్ పుంజుకుంటుందా.. ఆఖరి మ్యాచ్ ఫలితాన్ని కొనసాగిస్తుందా..?

Indian Women Eye Maiden Double Series Win in SA

హైదరాబాద్: దక్షిణాఫ్రికా జట్టుతో రెండు టీ20ల్లో వరుస విజయాలు అందుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు హ్యట్రిక్ విజయాన్ని నమోదు చేయబోయి బోర్లా పడింది. మూడో టీ20లో ఐదు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. గెలిచిన రెండు మ్యాచ్‌ల్లో వరుసగా ఏడు, తొమ్మిది వికెట్ల ఆధిక్యంతో గెలుపొందింది. మూడో విజయం ఓటమితో చతికిలబడ్డ భారత్ పునర్వైభవం కోసం తహతహలాడుతోంది.

ఓటమి నుంచి బయటపడాలని తీవ్రంగా శ్రమిస్తోంది. బుధవారం జరగనున్న నాలుగో టీ20 గెలిస్తే దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళలకు ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. అంటే రెండో సిరీస్ సైతం గెలిచుకున్నట్లవుతుంది. సెంచూరియన్‌లో సాయంత్రం గం.4.30 ని.లకు(భారత కాలమాన ప్రకారం) ఇరు జట్ల మధ్య నాల్గో టీ20 మ్యాచ్‌ ఆరంభం కానుంది.

సిరీస్‌ను 3-1తో ఇంకా మ్యాచ్‌ మిగిలి ఉండగానే సాధిస్తుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా పర్యటనలో ఒకేసారి వన్డే, టీ 20 సిరీస్‌లను గెలిచిన తొలి భారత జట్టుగా రికార్డుల్లో నిలుస్తుంది. మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు 2-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఇది దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌కు మొదటి టీ 20 సిరీస్‌ కావడంతో 'తొలి డబుల్‌'ను సాధించే అవకాశం అడుగు దూరంలో ఉంది. మరొకవైపు 2015-16 సీజన్‌లో ఆస్ట్రేలియాలో ఆ జట్టుతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళా జట్టు గెలుచుకుంది. ఆ తర్వాత ఇదే భారత మహిళా జట్టుకు మొదటి విదేశీ టీ20 సిరీస్‌. ఈ నేపథ్యంలో విదేశాల్లో వరుసగా రెండో టీ 20 సిరీస్‌ను కూడా సాధించి అరుదైన మైలురాయిని సొంతం చేసుకోవాలని టీమిండియా మహిళా బృందం భావిస్తోంది.

Teams (from):

India: Harmanpreet Kaur (captain), Smriti Mandhana (vice-captain), Mithali Raj, Veda Krishnamurthy, Jemimah Rodrigues, Deepti Sharma, Anuja Patil, Taniya Bhatia, Nuzhat Parveen Poonam Yadav, Rajeshwari Gayakwad, Shikha Pandey, Pooja Vastrakar, Radha Yadav, Rumeli Dhar.

South Africa: Dane van Niekerk (captain), Marizanne Kapp, Trisha Chetty, Shabnim Ismail, Ayabonga Khaka, Masabata Klaas, Sune Luus, Odine Kirsten, Mignon du Preez, Lizelle Lee, Chloe Tryon, Nadine de Klerk, Raisibe Ntozakhe, Moseline Daniels.

Match starts: 4:30 PM IST.
Channels: Sony Ten 1, Ten 3.

Story first published: Friday, February 23, 2018, 15:41 [IST]
Other articles published on Feb 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+