Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 Challenge: యూఏఈ చేరుకున్న మహిళా క్రికెటర్లు!!

Indian women cricketers reaches UAE for T20 Challenge

దుబాయ్‌: మహిళల టీ20 ఛాలెంజర్‌ (మినీ ఐపీఎల్‌) టోర్నీ కోసం భారత అమ్మాయిలు యూఏఈ చేరుకున్నారు. మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ లాంటి అగ్రశ్రేణి క్రికెటర్లతో పాటు జెమీమా రోడ్రిగ్స్‌ లాంటి యువ సంచలనాలు ప్రత్యేక విమానంలో గురువారం యూఏఈలో అడుగుపెట్టారు. మొత్తం 30మంది ప్రత్యేక విమానంలో దుబాయ్‌కి చేరుకున్నారు. పీపీఈ కిట్లతో ఉన్న ఈ క్రికెటర్ల ఫోటోలను ఐపీఎల్‌ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

తొమ్మిది రోజుల పాటు ముంబైలో క్వారంటైన్‌లో ఉన్న మహిళా క్రికెటర్లు.. యూఏఈలో బయో బబుల్‌లోకి ప్రవేశించే ముందు మరో వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. ఆ తర్వాత ప్రాక్టీస్‌ చేయనున్నారు. మహిళల చాలెంజర్‌ వచ్చే నెల 4 నుంచి 9 వరకు జరగనుంది. నాలుగు మ్యాచ్‌లకూ షార్జానే వేదిక కానుంది. ఒక్కో జట్టు రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ షార్జాలోనే నిర్వహించనున్నారు.

ఆరు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీలో సూపర్‌నోవాస్, ట్రయల్‌ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు తలపడనున్నాయి. ఈ జట్లకు మిథాలీ రాజ్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్ సారథ్యం వహిస్తారు. మినీ ఐపీఎల్‌గా పరిగణించే ఈ టోర్నీతోనే భారత మహిళా క్రికెటర్లు కరోనా విరామం తర్వాత తొలి సారి మళ్లీ బ్యాట్‌ పడుతున్నారు. మరోవైపు ఈ నెల 25న మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ ఆరంభమవుతుండడంతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ దేశాలకు చెందిన అగ్రశ్రేణి క్రికెటర్లు ఈ మినీ ఐపీఎల్‌కు దూరమయ్యారు. అయితే శ్రీలంక, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా ప్లేయర్లు మాత్రం లీగ్‌లో పాల్గొంటున్నారు.

Story first published: Friday, October 23, 2020, 7:36 [IST]
Other articles published on Oct 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+