For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC WTC Final‌: అతడు లేని భారత జట్టు.. చికెన్ లేని 'చికెన్ బిర్యానీ' లాంటిది!!

Indian Test Squad with out Bhuvneshwar Kumar is like Chicken Biryani without Chicken

హైదరాబాద్: సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18 నుంచి న్యూజిలాండ్‌తో జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం టీమిండియాను ఎంపిక చేసింది. 24 మందితో కూడిన జంబో జట్టును బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ ప్రకటించింది. ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు కూడా ఇదే జట్టును కొనసాగించనున్నారు. అందరూ ఊహించినట్లే ఇటీవల ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో ఆడినవారే ఎంపికయ్యారు. అయితే కొత్తగా నలుగురు యువకులను స్టాండ్‌ బై ఆటగాళ్లుగా బీసీసీఐ ఎంపిక చేసింది.

పాండ్యా, యాదవ్‌పై వేటు:

20 మంది ప్రాబబుల్స్‌తో కూడిన భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌లకు చోటు దక్కలేదు. ఐపీఎల్‌ 2021లో పరుగుల వరద పారించిన యువ ఓపెనర్‌ పృథ్వీ షాకు చోటు దక్కలేదు. పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో పాండ్యాను.. విదేశీ పర్యటనలో మెరుగైన ప్రదర్శన లేని కారణంగా షాను ఎంపిక చేయలేదు. ఇక గత రెండేళ్లుగా పేలవ ప్రదర్శన చేస్తున్న యాదవ్‌పై కూడా బీసీసీఐ సెలెక్టర్లు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే గాయం నుంచి కోలుకున్న తెలుగు ఆటగాడు హనుమ విహారి తిరిగి జట్టులోకి వచ్చాడు.

చికెన్ లేని చికెన్ బిర్యానీ లాంటిది:

చికెన్ లేని చికెన్ బిర్యానీ లాంటిది:

సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు నిరాశే ఎదురైంది. భువీ తొడ కండరాలు పట్టేయడంతో ఐపీఎల్ 2021లోని కొన్ని మ్యాచులు ఆడలేదు. అయితే ప్రస్తుతం గాయం నుంచి అతడు కోలుకున్నాడు. అయితే ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. రిషబ్‌ పంత్‌కు బ్యాకప్‌గా కేఎల్‌ రాహుల్‌, వృద్దిమాన్‌ సాహాల పేర్లు పరిశీలించనప్పటికి జట్టులో వారి పేర్లు ప్రకటించలేదు. వారిద్దరు తమ ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ను క్లియర్‌ చేయాల్సి ఉందని బీసీసీఐ ట్విటర్‌లో తెలిపింది. దీంతో భువీని ఎందుకు ఎంపికచేయలేదని ఫాన్స్ మండిపడుతున్నారు. 'రాహుల్‌, సాహాలకు అవకాశం ఇచ్చినట్టు.. భువీకి ఇవ్వాల్సింది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'భువనేశ్వర్ లేని భారత జట్టు.. చికెన్ లేని చికెన్ బిర్యానీ లాంటిది' అని ఇంకొకరు పేర్కొన్నారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

భారత జట్టు:

భారత జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకుర్‌, ఉమేశ్‌ యాదవ్‌. కేఎల్ రాహుల్‌, వృద్ధిమాన్‌ సాహా.

స్టాండ్‌బై ఆటగాళ్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, అర్జున్‌ నాగ్‌వస్వల్లా.

Story first published: Friday, May 7, 2021, 22:39 [IST]
Other articles published on May 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+