For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్: కోహ్లీసేన గురించి పూర్తిగా తెలుసుకోండి

 Indian Team World Cup 2019: Indian squad captain, important players, match schedule - all you need know

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్ ఫేవరేట్లలో టీమిండియా ఒకటి. గత కొన్నేళ్లుగా ఇంటా బయటా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అద్భుత విజయాలను నమోదు చేసింది. అంతేకాదు ప్రస్తుత భారత జట్టు అత్యుత్తమ క్రికెటర్లతో కళకళలాడుతోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

కోహ్లీ కెప్టెన్సీ, ధోని అనుభవం, ఓపెనర్ల భాగస్వామ్యం ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ఎంతో కీలకం. గత వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌ వరకు వెళ్లిన టీమిండియా ఈసారి ఎలాగైనా సరే విశ్వవిజేతగా నిలవాలని ఊవిళ్లూరుతోంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.

యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. టోర్నీకి ముందు టీమిండియా మే 25న న్యూజిలాండ్‌తో, మే 28న బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది.

ఈ మెగా టోర్నీలో భాగంగా విరాట్‌ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. వరల్డ్‌కప్‌లో టీమిండియా జట్టు, కీలక ఆటగాళ్లు, మ్యాచ్ షెడ్యూల్‌ని ఒక్కసారి పరిశీలిద్దాం...

కెప్టెన్ : విరాట్ కోహ్లీ

కెప్టెన్ : విరాట్ కోహ్లీ

కోచ్: రవిశాస్త్రి

వరల్డ్ కప్ గెలిచిన సందర్భాలు: 1983, 2011

వరల్డ్‌కప్‌లో భారత జట్టు

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ధోని(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ

వరల్డ్‌కప్‌లో టీమిండియా షెడ్యూల్

వరల్డ్‌కప్‌లో టీమిండియా షెడ్యూల్

June 5: South Africa vs India - 3:00 PM (The Rose Bowl, Southampton)

June 9: India vs Australia - 3:00 PM (Kennington Oval, London)

June 13: India vs New Zealand - 3:00 PM (Trent Bridge, Nottingham)

June 16: India vs Pakistan - 3:00 PM (Old Trafford, Manchester)

June 22: India vs Afghanistan - 3:00 PM (The Rose Bowl, Southampton)

June 27: West Indies vs India - 3:00 PM (Old Trafford, Manchester)

June 30: England vs India - 3:00 PM (Edgbaston, Birmingham)

July 2: Bangladesh vs India - 3:00 PM (Edgbaston, Birmingham)

July 6: Sri Lanka vs India - 3:00 PM (Headingley, Leeds)

Story first published: Wednesday, May 22, 2019, 17:23 [IST]
Other articles published on May 22, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+