మొహాలి: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌కు భారత జట్టు హాజరవుతుందని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో మొహాలి వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
యువరాజ్ సింగ్, కోహ్లీ ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరూ టీమిండియాకు నేతృత్వం వహించడంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరుపున పలు మ్యాచ్‌లు కూడా ఆడారు. మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. 103 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 20.2 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది. ఇదిలా ఉంటే హాలీవుడ్ నటి, మోడల్ హజల్ కీచ్‌తో యువరాజ్ వివాహం నిరాడంబరంగా జరగనుంది.

ఈనెల 30న చండీగఢ్‌లో పంజాబీ సంప్రదాయంలో యువీ వివాహం చేసుకోనున్నాడు. ముందుగా 30న సిక్కు సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న తర్వాత డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం జరిపించనున్నారు. ఈ కార్యక్రమానికి వధూవరుల కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారు. డిసెంబర్ 5న చత్తార్‌పూర్‌లో సంగీత్, 7న ఢిల్లీలోని ఓ హోటల్‌లో రిసెప్షన్ జరుగనుంది.