జూన్ 23న ఐర్లాండ్‌కు.. వెనువెంటనే ఇంగ్లాండ్ పర్యటనకు కోహ్లీ సేన

హైదరాబాద్: రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం కోహ్లీ సేన శుక్రవారం భారత్ నుంచి ఐర్లాండ్ బయల్దేరనుంది. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. 'ఈ నెల 27, 29న ఐర్లాండ్‌తో టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో శనివారం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఐర్లాండ్ బయల్దేరనుంది. సిరీస్ ప్రారంభానికి నాలుగు రోజుల ముందుగానే టీమిండియా ఐర్లాండ్ చేరుకోనుంది' అని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు.

ఐర్లాండ్ నుంచి నేరుగా ఇంగ్లాండ్‌కు భారత్:
‘సిరీస్ ముగిసిన అనంతరం ఐర్లాండ్ నుంచి నేరుగా భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ పయనమవ్వనున్నారు. జులై 3 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత వన్డే, టెస్టు సిరీస్‌లు జరగనున్నాయి. సెప్టెంబరులో ఇంగ్లాండ్‌లో భారత్ పర్యటన ముగియనుంది' అని అధికారులు తెలిపారు. గతంలో ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు 1-3తో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది.

జూన్ 27, 29 తేదీల్లో జరగనున్న రెండు టీ20 మ్యాచ్‌లు
ఈ పర్యటనలో భాగంగా ఐర్లాండ్ జట్టుతో టీమిండియా ఆడనున్న రెండు టీ20 మ్యాచ్‌లు జూన్ 27, 29 తేదీల్లో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు సంబంధించి ప్రసార హక్కులను సోనీ సంస్ధ దక్కించుకుంది. సోనీ సిక్స్, సోనీ టెన్ 3లో ఈ రెండు మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఐర్లాండ్‌లోని డబ్లిన్ వేదికగా ఈ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. సోనీ లైవ్ యాప్‌లో కూడా ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటల నుంచి ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

జులై 3 నుంచి ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య..:
మరోవైపు టీమిండియాతో తలపడే ఐర్లాండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 మంది సభ్యులతో కూడిన జట్టును ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గ్యారీ విల్సన్ ఐర్లాండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఐర్లాండ్ పర్యటన ముగించుకున్న అనంతరం టీమిండియా సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. జులై 3 నుంచి ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
భారత్‌తో తలపడే ఐర్లాండ్ జట్టు:
గ్యారీ విల్సన్ (కెప్టెన్), ఆండ్రూ బాల్‌బిర్ని, పీటర్ చేజ్, జార్జ్ డాక్‌రెల్, జాష్ లిటిల్, ఆండ్రూ మెక్‌బ్రైన్, కెవిన్ ఓబ్రియన్, విలియమ్ పోర్టర్‌ఫీల్డ్, స్టువర్ట్ పోయంటర్, బోయడ్ రాన్‌కిన్, జేమ్స్ షన్నాన్, సిమి సింగ్, పాల్ స్టిర్లింగ్, స్టువర్ట్ థాప్సన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications