Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Vs South Africa: వ‌న్డే సిరీస్ నుంచి రోహిత్ ఔట్.. కెప్టెన్‌గా రాహుల్

Indian Team selected for ODI series against South Africa
IND vs SA : KL Rahul As ODI Captain | Oneindia Telugu

సౌతాఫ్రికాతో మూడు వ‌న్డేల సిరీస్‌కు సెలెక్ట‌ర్లు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించారు. అంతా అనుమానం వ్య‌క్తం చేసిన‌ట్టుగానే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఈ సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. కొన్ని రోజుల క్రితం ప్రాక్టీస్‌లో గాయ‌ప‌డ్డ హిట్‌మ్యాన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అత‌ను పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డానికి మ‌రికొన్ని రోజులు ప‌ట్ట‌నుండ‌డంతో రోహిత్‌ను సెలెక్ట‌ర్లు ఈ సిరీస్‌కు దూరంగా వ‌చ్చారు. దీనికి తోడు రానున్న ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీల‌ను దృష్టిలో పెట్టుకోని కెప్టెన్‌ రోహిత్‌తో ప్ర‌యోగాలు చేయ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్ అనే ఆలోచ‌న‌తో ఎంపిక చేయ‌లేదు.

అలాగే గాయాలతో ఇంకా కోలుకోని ఆల్‌రౌండ‌ర్లు ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్‌ను కూడా జ‌ట్టులోకి తీసుకోలేదు. రోహిత్ శ‌ర్మ స్థానంలో ఇప్ప‌టికే టీమిండియా భ‌విష్య‌త్‌ కెప్టెన్‌గా పేరు తెచ్చుకుంటున్న ఓపెన‌ర్ కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక‌య్యారు. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా పేస్ గ‌న్ జ‌స్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక‌ చేయ‌డం విశేషం.

సీనియ‌ర్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ జ‌ట్టులో త‌న స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు. అలాగే సీనియ‌ర్ పేసర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ కూడా త‌న స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు. మ‌రో సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీకి సెలెక్ట‌ర్లు విశ్రాంతి ఇచ్చారు. ఐపీఎల్‌తోపాటు దేశ‌వాళి టోర్నీల్లో అద‌ర‌గొడుతున్న యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, వెంక‌టేశ్ అయ్య‌ర్ జ‌ట్టులో స్థానం సంపాదించుకున్నారు. వికెట్ కీప‌ర్లుగా రిష‌బ్ పంత్, ఇషాన్ కిష‌న్ ఎంపిక అయ్యారు. అలాగే ఆల్ రౌండ‌ర్లుగా వాషింగ్ట‌న్ సుంద‌ర్, శార్ధూల్ ఠాకూర్ ఎంపిక‌య్యారు.

సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ చాలా కాలం త‌ర్వాత వ‌న్డే జ‌ట్టులోకి వ‌చ్చాడు. స్పిన్ కోటాలో అశ్విన్‌తోపాటు య‌జుర్వేంద్ర చాహ‌ల్‌ను సెలెక్ట‌ర్లు ఎంపిక చేశారు. ఇక పేస‌ర్లుగా భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, బుమ్రాను జ‌ట్టులోకి తీసుకున్నారు. మొత్తం 18 మందితో కూడిన భారత జ‌ట్టును సెలెక్ట‌ర్లు ఎంపిక చేశారు. కాగా ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌న‌వ‌రి 19 నుంచి 23 మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ జ‌ర‌గ‌నుంది. 19న పార్ల్‌లో తొలి వ‌న్డే జ‌ర‌గ‌నుండ‌గా.. 21, 23న కేప్‌టౌన్ మైదానంలో రెండు, మూడు వ‌న్డేలు జ‌ర‌గ‌నున్నాయి.

భార‌త జ‌ట్టు
కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), జ‌స్ప్రీత్ బుమ్రా(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధవన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), చహల్‌, ఆర్‌ అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్ధూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌

Story first published: Saturday, January 1, 2022, 9:32 [IST]
Other articles published on Jan 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+