Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా క్రికెటర్లకు రెండు వారాల క్వారంటైన్‌ తప్పదు: బీసీసీఐ

Indian team open to be in two-week quarantine to save Australia series says BCCI official

ముంబై: క‌రోనా వైర‌స్ మహమ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రీడాలోకం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్ర‌తిష్టాత్మ‌క ఒలింపిక్స్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. అయితే క‌రోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత క్రీడా కార్య‌క‌లాపాలు ఆరంభ‌మైతే.. తీసుకోవాల్సిన చర్యల‌పై అన్ని దేశాలు జాగ్ర‌త్త‌లు తీసు‌కుంటున్నాయి. ఈ క్రమంలో రాబోయే ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న కోసం భార‌త క్రికెటర్లు రెండు వారాల‌ పాటు క్వారంటైన్‌లో ఉండ‌టానికి సిద్ధ‌మ‌ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది.

క్వారంటైన్‌ తప్పదు:

క్వారంటైన్‌ తప్పదు:

కరోనా తగ్గుముఖం పట్టాక టీమిండియా విదేశాల్లో ఎక్కువగా పర్యటించాల్సి ఉంది. మొదటగా టీ20 ప్రపంచకప్ ఉండగా.. అది జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఆపై ఆసీస్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఉంది. ఆస్ట్రేలియాలో కరోనా కట్టడి కాగా.. అయితే ఈ సిరీస్‌ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. తాజాగా బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ మాట్లాడుతూ.. ద్వైపాక్షిక సిరీస్‌లకు సంబంధించి భారత్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌కు వెళ్లేముందు టీమిండియా రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంటుందని స్పష్టంచేసాడు. ఇంతకు మించి మరో మార్గం లేదన్నాడు.

పెద్ద సమయమేమీ కాదు:

పెద్ద సమయమేమీ కాదు:

'రెండు వారాల క్వారంటైన్ పెద్ద సమయమేమీ కాదు. ప్రతి క్రీడాకారుడు తప్పక దీన్ని పాటించాలి. ఎందుకంటే.. ఇప్పటికే రెండు నెలల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లే ముందు మరో రెండు వారాలు లాక్‌డౌన్‌లో ఉండటం పెద్ద విషయం కాదు. ఇందుకు ఎలాంటి నిబంధలు, ప్రమాణాలు పాటించాలన్నది లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత ప్రకటిస్తాం' అని ధుమాల్‌ తెలిపాడు. ఆస్ట్రేలియాతో భారత్ 5 టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడాల్సి ఉంది.

పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడటం మంచిది:

పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడటం మంచిది:

ఇటువంటి కఠిన పరిస్థితుల్లో పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడటం వల్ల ఆదాయం పెరుగుతుందని అరుణ్ ధుమాల్‌ అభిప్రాయపడ్డాడు. 'ఈ నిర్ణయం లాక్‌డౌన్‌ విధించక ముందు తీసుకున్నది. ఇరు బోర్డులు ఒక అంగీకారానికి వచ్చి.. ఒక టెస్ట్‌, రెండు వన్డేలు, రెండు టీ20లు ఆడే అవకాశం ఉందేమో పరిశీలించాలి. లాక్‌డౌన్‌ కారణంగా ఎంతో నష్టం వాటిల్లింది. ఇప్పుడు ఆదాయం రావాలంటే.. టెస్టుల కన్నా వన్డేలు, టీ20లే బెస్ట్' అని చెప్పుకొచ్చాడు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జరిగితే

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జరిగితే

వ‌చ్చే న‌వంబ‌ర్‌లో ఆసీస్ ప్రారంభం కావాల్సి ఉంది. అంత‌కుముందు ఆస్ట్రేలియాలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ షెడ్యూలై ఉంది. ఒకవేళ ఈ టోర్నీ జ‌రిగితే.. భార‌త టూర్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌బోవ‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆసీస్‌లో వైర‌స్ ప్రభావం తగ్గుముఖం ప‌ట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆస్ట్రేలియాలో 6,900 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. దాదాపు 100 మంది మ‌ర‌ణించారు. ఇక కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు సంఖ్య కొద చాలా త‌క్కువ.

Story first published: Friday, May 8, 2020, 15:14 [IST]
Other articles published on May 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+