ఆస్ట్రేలియాకు బయలుదేరిన టీం ఇండియా
ముంబై: భారత క్రికెట్ జట్టు సభ్యులు సోమవారం ఉదయం ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆస్ట్రేలియాపై విజయం సాధించి తీరాలనే పట్టుదలతో వారున్నారు. కెప్టెన్ అనిల్ కుంబ్లేతో పాటు అతని జట్టు సభ్యులు సోమవారం ఉదయం విమానంలో వారు సింగపూర్ బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి వారు మెల్బోర్న్ చేరుకుంటారు. ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో ఆడడం కష్టమైన పనేనని, అయితే తాము ఆ సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని కుంబ్లే అన్నారు.
పాకిస్తానుతో తాము బాగా ఆడామనిు, తాము వన్డే సిరీస్ నే కాకుండా టెస్టు సిరీస్ ను కూడా గెలుచుకున్నామని, ఇది తమ విశ్వాసాన్ని పెంచిందని ఆయన అన్నారు. నాలుగు టెస్టుల సిరీస్ తర్వాత కుంబ్లే ఇండియాకు తిరిగి వస్తారు. ఆ తర్వాత జరిగే వన్డేలకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహిస్తారు. ఆస్ట్రేలియా పరిస్థితులను తట్టుకోవడానికి తమకు తగిన అనుభవం ఉందని, అంతర్జాతీయ మ్యాచులకు ఇది అవసరమని ఆయన అన్నారు. తమ జట్టులో పలువురు సీనియర్లు ఉన్నారని, వారి అనుభవం బాగా పనికి వస్తుందని ఆయన అన్నారు.
Story first published: Monday, December 17, 2007, 23:53 [IST]
Other articles published on Dec 17, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications