
హైదరాబాద్: టీమిండియా ఆటగాళ్లు సంతకం చేసిన బ్యాట్‌ను సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేలం వేయనుంది. 2007లో ధోనీ నాయకత్వంలో సిడ్నీ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలిచింది. ఆ సందర్భంలో మ్యాచ్‌లో పాల్గొన్న క్రికెటర్లంతా సంతకం చేసిన బ్యాట్‌ను వేలానికి వేయాలని తలంచారు. ఈ వేలం ద్వారా వచ్చే విరాళాలను చాపెల్ ఫాండేషన్ ద్వారా సేకరించనున్నారు.
బ్యాట్‌ను మే 24న సిడ్నీ క్రికెట్ మైదానంలో వేలానికి అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు డిన్నర్ ఈవెంట్‌ను సైతం నిర్వహించనున్నట్లు సమాచారం. దీని ద్వారా వచ్చే నిధులను నిరాశ్రయులకు ఇళ్లు కట్టించనున్నట్లు సమాచారం. ఈ వేలం ద్వారా రెండు లక్షల యూఎస్ డాలర్లను సమీకరించాలని ఫౌండేషన్ భావిస్తోంది.
ఈ డిన్నర్‌లో పాల్గొంటున్న 400 మంది ఎన్నారైలలో సిడ్నీలోని 30 మంది భారతీయులున్నారు. ఈ డిన్నర్‌లో ముఖ్యులైన సోదరులు ఇయాన్, గ్రెగ్, ట్రెవర్ చాపెళ్లతోపాటు దిగ్గజ ఆటగాడు నీల్ హార్వే కూడా పాల్గొననున్నాడు. వేలంలో బ్యాట్‌తో పాటు...1958 యాషెస్ సిరీస్‌లో ఆడిన ప్రసిద్ధ ఆటగాడు ఫ్రాంక్ టైసన్ ధరించిన పుల్లోవర్ కూడా ఉంది.
ప్రపంచ కప్ మ్యాచ్ ఆడిన సిడ్నీ గ్రౌండ్‌లోనే:
ఐసీసీ దక్షిణాఫ్రికాలో 2007లో నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు కప్ కోసం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్సీలోని భారత జట్టు విజయం సాధించి కప్ గెలుచుకోవడం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. వేలం నిర్వహించబోతున్న చాపెల్ ఫౌండేషన్ ఛైర్మన్‌గా భారత వ్యాపారవేత్త అయిన దర్శక్ మెహతా విధులు నిర్వర్తించునున్నారు. బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ లో ఒకరిగా లిసా స్టాలేకర్, బ్రాడ్ కాస్టర్‌గా ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కొనసాగుతున్నారు.