Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'సచిన్' సినిమా వీక్షించిన టీమిండియా: ట్విట్టర్‌లో రివ్యూ (ఫోటోలు)

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన 'సచిన్‌-ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' సినిమాను టీమిండియా బుధవారం వీక్షించింది. ముంబైలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు క్రికెటర్లందరూ హాజరయ్యారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని భారత ఆటగాళ్లకు ప్రత్యేకంగా ప్రదర్శించారు.

Indian Team Attends Premiere Of Sachin’s Biopic! Their Reviews On Twitter

ఆత్మీయులు, సన్నిహితులు ఇలా సచిన్‌ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ప్రముఖులతో బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్‌ కళకళలాడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని ప్రేయసి, బాలీవువడ్ నటి అనుష్క శర్మ ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఉబెర్ చిక్ స్లేట్ గ్రే జంప్‌ సూట్‌లో అనుష్క, సరికొత్త హెయిర్ స్టయిల్‌లో విరాట్ కోహ్లీ దర్శనమిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ బయల్దేరే ముందు భారత ఆటగాళ్లు సచిన్ సినిమాని వీక్షించారు. ఈ సందర్భంగా టీమిండియా మొత్తం ఒక్క చోట చేరి ఆటపాటలతో సందడి చేసింది.

యువరాజ్ సింగ్ తన డ్యాన్స్‌లతో అక్కడ ఉన్న అందర్ని ఆకట్టుకోగా, ధోని, సచిన్‌ల ముచ్చట్లు హైలెట్‌గా నిలిచాయి. బ్లాక్ సూట్‌లో సచిన్, పింక్ డ్రెస్‌లో అంజలి మెరిసిపోయారు. అంతేకాదు ఈ సినిమా ప్రత్యేక షోకు వచ్చిన అందరికీ సచిన్ జోడీ ఆత్మీయస్వాగతం పలికింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+