For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మిడిలార్డర్‌లో అనుభవలేమి, టీమిండియాను ఓడించడానికి ఇదే సరైన అవకాశం'

Indian T20I team inexperienced in middle order in Virat Kohlis absence: VVS Laxman

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో భారత టీ20 జట్టు మిడిల్ ఆర్డర్‌లో అనుభవలేమి కనబడుతోందని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాను ఓడించడానికి బంగ్లాదేశ్‌కు ఇదే మంచి అవకాశమని కూడా లక్ష్మణ్‌ అన్నాడు.

భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ 3 టీ20లు, 2 టెస్టులు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ "టీమిండియాను సొంతగడ్డపై ఓడించడానికి బంగ్లాదేశ్‌కు ఇదే మంచి అవకాశం. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంది" అని చెప్పాడు.

బ్యాటింగ్‌లో రాణిస్తే

బ్యాటింగ్‌లో రాణిస్తే

"బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌లో రాణిస్తే భారత్‌కు గట్టి పోటీ ఇస్తుంది. బంగ్లాదేశ్‌కు బలహీనం ఏదైనా ఉందంటే అది బౌలింగ్‌లోనే. బంగ్లా బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌పై ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే స్పిన్‌ విభాగంలో ఆ జట్టు బలంగా లేదు కాబట్టి... ముస్తాఫిజుర్ కొత్త బంతితో ఆరంభంలో వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది" అని లక్ష్మణ్ అన్నాడు.

భారత జట్టులో విరాట్‌ కోహ్లీ లేడు

భారత జట్టులో విరాట్‌ కోహ్లీ లేడు

"భారత జట్టులో విరాట్‌ కోహ్లీ లేడు. దీంతో మిడిల్‌ ఆర్డర్‌లో భారత్‌ జట్టు అనుభవ లేమి కనబడుతోంది. ఇక భారత్‌ విజయాల్లో ముఖ్య భూమిక పోషించడానికి యువ క్రికెటర్లు సిద్ధం కావాలి. వాషింగ్టన్‌ సుందర్‌, చహల్‌లు భారత బౌలింగ్‌ యూనిట్‌లో కీలకం కానున్నారు. టీ20 సిరీస్‌కు సన్నద్ధమైన వేదికలు స్పిన్‌కు ఎక్కువ అనుకూలించే అవకాశాలున్నాయి" అని లక్ష్మణ్ తెలిపాడు.

అనుభవరాహిత్యం ఉంది

అనుభవరాహిత్యం ఉంది

"ప్రస్తుతం బౌలింగ్ లైనప్‌లో చాలా అనుభవరాహిత్యం ఉంది కాబట్టి యుజువేంద్ర చాహల్ మూడు మ్యాచ్‌లు ఆడతారని ఆశిస్తున్నాను. కృనాల్‌ పాండ్యా వంటి యువ క్రికెటర్లకు ఇదొక మంచి అవకాశం. భారత్‌ 2-1 తేడాతో గెలుస్తుందనే అనుకుంటున్నా" అని వీవీఎస్ లక్ష్మణ్‌ పేర్కొన్నాడు.

జట్టులో అందరూ యువ క్రికెటర్లే

జట్టులో అందరూ యువ క్రికెటర్లే

"భారత జట్టులో రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌లు తప్పిస్తే మిగతా వారంతా దాదాపు యువ క్రికెటర్లే. సిరీస్ గెలవడానికి నేను భారత బ్యాటింగ్ పవర్‌కే మద్దతు ఇస్తున్నాను" అని లక్ష్మణ్ అన్నాడు. ఈ సిరీస్‌లో పలువురు సీనియర్ క్రికెటర్లకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

కోహ్లీకి విశ్రాంతి... కెప్టెన్‌గా రోహిత్ శర్మ

కోహ్లీకి విశ్రాంతి... కెప్టెన్‌గా రోహిత్ శర్మ

వరల్డ్‌కప్ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో సెలక్టర్లు అతడికి విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. టీ20 సిరిస్ అనంతరం రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు తిరిగి కోహ్లీ నాయకత్వం వహించనున్నాడు.

Story first published: Thursday, October 31, 2019, 18:07 [IST]
Other articles published on Oct 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+